ఏంటి టీచరమ్మా.. ఇలా చేశావ్‌..షాకింగ్ వీడియో

Updated on: Apr 18, 2025 | 1:07 PM

శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. హోం వర్క్ చేయలేదని ముగ్గురు విద్యార్థులను ఓ ఉపాధ్యాయురాలు చెప్పుతో కొట్టారు. స్థానిక జీనియస్ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. రెండో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు హోం వర్క్ చేయకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఉపాధ్యాయురాలు అనిత వారిని చెప్పుతో కొట్టారు.

విషయం తెలిసిన బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఆందోళనకు దిగారు. చిన్నపిల్లలని కూడా చూడకుండా విద్యార్థులను చెప్పుతో కొట్టడం ఏమిటని పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు. దీంతో పాఠశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న వన్‌టౌన్ పోలీసులు స్కూలు వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పాఠశాల యాజమాన్యం విద్యార్ధుల తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని హామీ ఇవ్వడంతో విద్యార్ధుల తల్లిదండ్రులు శాంతించారు.

మరిన్ని వీడియోల కోసం

గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో

అమెరికన్లపై చైనీయుల మీమ్స్‌ వీడియో

రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్‌ వాటే లైఫ్‌ వీడియో