Oldmonk Rum Tea: ఇదో వెరైటీ టీ.. ఓల్డ్‌మంక్‌తో గరం గరం తందూరీ ఛాయ్‌.. లొట్టలేసుకుంటూ తాగేస్తున్న జనం..

Updated on: Nov 10, 2022 | 8:21 PM

మెదడుకు సాంత్వన కలిగించే టీలో రకరకాల ఫ్లేవర్లు, ఉంటాయి. అల్లం టీ, బాదం టీ, బ్లాక్‌ టీ, గ్రీన్‌ టీ, ఊలాంగ్‌ టీ.. ఇలా ఎన్నో రకాలు ఉంటాయి. ఇదిలా ఉంటే కస్టమర్లను ఆకట్టుకోవడానికి వ్యాపారులు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటారు.


టీ అమ్ముకునే ఓ వ్యాపా త‌న ఛాయ్‌కి గిరాకీ పెంచుకునేందుకు వినూత్నంగా ఆలోచించాడు. ఓల్డ్ మాంక్ ర‌మ్‌తో గ‌రం తందూరీ టీ త‌యారుచేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఛాయ్‌ పేరు మాత్రమే కాదు తయారీ కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఈ టీ తయారు చేయడానికి అతను ఓ పాత్రలో మొదట కొద్దిగా బెల్లం పొడి వేసి మంటపై ఉంచాడు. ఆతర్వాత అందులో ఓల్డ్‌ మాంక్‌ రమ్‌ పోశాడు. ఆపై టీ పొడి వేశాడు. చివరిగా వేడి వేడి టీని మ‌ట్టి క‌ప్పుల్లో పోసి కస్టమర్లకు సర్వ్‌ చేయడం మనం చూడవచ్చు.గోవాలో టూరిస్టులు ఎక్కువగా తిరిగే బీచ్‌లో ఈ టీ స్టాల్‌ ఏర్పాటు చేసుకున్నాడు. దీంతో బీచ్‌ సందర్శనకు వచ్చిన వాళ్లందరూ లొట్టలేసుకుని మరీ వెరైటీ ఛాయ్‌ని తాగుతున్నారు. ఈ టీ రుచిని కొంద‌రు మెచ్చుకుంటుంటే, మ‌రికొంద‌రేమో అస్సలు బాగాలేదు అంటూ పెదవి విరిస్తున్నారు. కాగా అత‌ను టీ త‌యారుచేస్తున్న వీడియోను ఒక యూజ‌ర్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. దీంతో ఈ వీడియో కాస్తా ఆన్‌లైన్‌లో తెగ వైర‌ల్ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girls Fighting: రెచ్చిపోయి చిత్తు చిత్తుగా నడిరోడ్డుపై కొట్టుకున్న ఇద్దరు అమ్మాయిలు.. మధ్యలో యువకుడు బలి..వీడియో.

Parrot: ఈ చిలుక పెద్ద ముదురు.. వాట్సాప్ చాట్ కుమ్మేస్తోందిగా.. ఇష్టమైన వారికి వీడియోకాల్‌ కూడా..

Mobile Robbery: మొబైల్‌ కొట్టేసిన దొంగ.. క్షణంలో మైండ్‌ బ్లాకింగ్‌ సీన్‌..! ఇదే పనిష్మెంట్..

Published on: Nov 10, 2022 08:21 PM