దర్జాగా రోడ్డు దాటిన పులి.. నిలిచిపోయిన వాహనాలు..

Updated on: Mar 18, 2026 | 6:19 PM

మహారాష్ట్రలోని తడోబా టైగర్ ప్రాజెక్ట్‌లో ఒక పులి దర్జాగా రోడ్డు దాటుతూ అందరినీ ఆశ్చర్యపరిచింది. వాహనాల శబ్ధానికి సాధారణంగా జంతువులు భయపడతాయి, కానీ ఈ పులి ఏమాత్రం బెరుకు లేకుండా ముందుకు సాగింది. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనదారులు తమ ఫోన్లలో పులి కదలికలను రికార్డు చేశారు. ఎవరికీ హాని చేయకుండానే పులి అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అడవికి రాజంటే సింహమే కావచ్చు.. కానీ అడవిలో తన దారికి ఎవరూ అడ్డు రాకూడదని భావించే అసలైన ‘బాస్’ పులి అని మరోసారి రుజువైంది. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా, తడోబా టైగర్ ప్రాజెక్ట్ పరిధిలోని పద్మాపూర్-మొహర్లి రహదారిపై ఒక పులి దర్జాగా రోడ్డు దాటుతూ పర్యాటకులను, వాహనదారులను ఆశ్చర్యపరిచింది. సాధారణంగా వాహనాల సౌండ్‌కి అడవి జంతువులు భయపడి పారిపోతాయి. కానీ, ఈ పులి మాత్రం ‘మనకు అలాంటి భయాలేమీ లేవమ్మా’ అన్నట్లుగా ప్రశాంతంగా అడుగులు వేస్తూ రోడ్డుపైకి వచ్చింది. పులి రాకను గమనించిన వాహనదారులు తమ వాహనాలను రోడ్డుకు ఇరువైపులా నిలిపివేశారు. దీంతో అక్కడ కాసేపు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనాల రొద, మనుషుల అలికిడి చూసి పులి కాస్త బెదిరినట్లు అనిపించినా, వెనక్కి తగ్గకుండా దర్జాగా రోడ్డు దాటి అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. పులి తమకు అత్యంత సమీపంలో కనిపించడంతో వాహనదారులు తమ వాహనాలను దిగి ఉత్సాహంగా ముందుకు కదిలారు. అది తమపై దాడిచేస్తుందేమోనన్న భయం లేకుండా పులికి అత్యంత సమీపంగా వెళ్తూ తమ సెల్‌ఫోన్లలో పులి కదలికలను రికార్డు చేశారు. ఆ సమయంలో పులి ఆకలితో లేదో ఏమో కానీ, ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టకుండా తన దారిన తాను వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉగాదికి వేప పువ్వు దొరికేనా ?? వేపచెట్లకు ఏమైంది ??

జూలో ఫుడ్ పెట్టిన చిన్నారిపై సింహం దాడి.. వైరల్ వీడియో

గ్యాస్ వినియోగదారులకు బిగ్‌ రిలీఫ్‌.. ఈ విధంగా చేయండి

పాపం.. గోల్డ్‌ అనుకొని స్కెచ్‌ వేశారు.. చివరికి..

ఏటీఎంలో చోరీకి విఫల యత్నం.. చివరికి ఇలా..

Follow Us