Sunrise: అక్కడ నాలుగు నెలలు గాఢ అంధకారం.. తర్వాత సూర్యోదయం.. చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు..

|

Aug 28, 2022 | 9:58 AM

మంచుతో కప్పబడి ఉండే అంటార్కిటికాలో తొలి సూర్యోదయం నమోదైంది. నాలుగు నెలల అంధకారం తర్వాత అక్కడ వెలుతురు నెలకొంది. చలికాలంలో చీకటి, వేసవి కాలంలో పగలు ఉండే


మంచుతో కప్పబడి ఉండే అంటార్కిటికాలో తొలి సూర్యోదయం నమోదైంది. నాలుగు నెలల అంధకారం తర్వాత అక్కడ వెలుతురు నెలకొంది. చలికాలంలో చీకటి, వేసవి కాలంలో పగలు ఉండే అంటార్కిటికాలో శీతాకాలం కంప్లీట్ అయింది. ఈ మేరకు అంటార్కిటికాలో సూర్యుడి కిరణాలు పడినట్లు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తెలిపింది. సాధారణంగా అంటార్కిటికాలో ఆగస్టులో శీతాకాలం ముగుస్తుంది. దీంతో ఈ నెలలోనే భానుడు తన కిరణాలను ప్రసరింపజేస్తాడు. ఈ క్రమంలో నాలుగు నెలల సుదీర్ఘ సమయం తర్వాత తొలి సూర్యోదయం నమోదైంది. ఈ మేరకు అక్కడ తీసిన ఫొటోను యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ రిలీజ్ చేసింది. అంటార్కిటికాలో వేసవి, శీతాకాలాలు రెండే ఉంటాయి. మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అంటార్కిటికాలో మే నెలలో శీతాకాలం మొదలవుతుంది. టెంపరేచర్ మైనస్ 70, 80 డిగ్రీలకు పడిపోతాయి. ఆగస్టు వరకు అక్కడ నాలుగు నెలలపాటు గాఢ అంధకారం నెలకొంటుంది. కాగా ఈ కాలాన్ని సైంటిస్టులు తమకు ఉపయోగకరమైనవి గా మార్చుకుంటారు. బయోమెడికల్ పరిశోధనలతోపాటు వివిధ అంశాలపై పరిశోధనలు చేస్తారు. వాతావరణాల మార్పులు, మానవ మనుగడ వంటి అంశాలను అధ్యయనం చేస్తారు.

Liger HD Stills And Posters: రౌడీ హీరో ఫ్యాన్స్ కి అలెర్ట్.. లైగర్ హెచ్ డి పోస్టర్స్ అండ్ స్టిల్స్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girl letter to Modi: పెన్సిల్‌ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?

Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..

Follow us on