స్నేహమంటే ఇదేరా.. నెట్టింట వైరల్‌ అవుతున్న క్యూట్‌ వీడియో

|

May 23, 2023 | 9:57 AM

స్నేహానికి కులం, మతం, పేద, గొప్ప అనే తేడాలుండవని అనేక సినిమాల్లో మనం చూశాం. నిజ జీవితంలోనూ కొందరు అంతటి స్నేహాన్ని కలిగి ఉంటారు. ఇది మనుషుల్లోనే కాదు జంతువుల్లోనూ కనిపిస్తుంది. తాజాగా ఓ వీధి కుక్క, పెంపుడు కుక్కల మధ్య స్నేహానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

స్నేహానికి కులం, మతం, పేద, గొప్ప అనే తేడాలుండవని అనేక సినిమాల్లో మనం చూశాం. నిజ జీవితంలోనూ కొందరు అంతటి స్నేహాన్ని కలిగి ఉంటారు. ఇది మనుషుల్లోనే కాదు జంతువుల్లోనూ కనిపిస్తుంది. తాజాగా ఓ వీధి కుక్క, పెంపుడు కుక్కల మధ్య స్నేహానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో రోడ్డుపక్కన ఓ షాపింగ్‌ మాల్‌ ఎదురుగా ఓ కారు ఆగి ఉంది. అందులో సైబీరియన్ హస్కీ, గోల్డెన్ రిట్రీవర్ కుక్కలు ఉన్నాయి. అక్కడే కారు బయట ఓ వీధి కుక్క నిలబడి ఉంది. ఆ వీధి కుక్కను చూసి కారులో ఉన్న ఆ విదేసీ కుక్కలు తోక ఊపుతూ స్నేహంగా చూశాయి. దాంతో ఈ వీధి కుక్క వాటి దగ్గరకు వెళ్లి తన ముందరి కాలితో వాటిని పట్టుకొని ఫ్రెండ్‌షిఫ్‌ చేసుకుంది. అంతేకాదు వాటికి ప్రేమగా ముద్దులు కూడా పెట్టింది. దాని స్నేహాన్ని స్వీకరించినట్టుగా కారులో ఉన్న ఖరీదైన కుక్కలు కూడా తమ రియాక్షన్‌ ఇచ్చాయి. ఈ వీడియోను విదిత్‌ శర్మ అనే యూజర్‌ తన ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ప్రజలు ఫాన్సీ ఫారెన్ బ్రీడ్‌లను ఎంచుకుంటూ.. వీధి కుక్కలను విస్మరిస్తున్నారు. ఇది చాలా బాధాకరం.. ఈ పరిస్థితులు మారాలి… మార్చాలి.. మన వీధి కుక్కలకు కూడా తగిన ప్రేమ, సంరక్షణను అందిద్దాం అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. నెట్టింట వైరల్‌గా మారిన ఈ వీడియోపై భిన్న రకాలుగా స్పందించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాత పైపుల్లోంచి వింత శబ్ధం !! ఏంటా అని చూస్తే ఒక్కసారిగా

నీటిలో చకచకా ఈదుతున్న తల లేని చేప.. ఇలా ఎలా అని షాక్ అవుతున్న నెటిజన్స్

వార్నీ.. ఇదేం బౌలింగ్‌రా సామీ.. చూస్తే నవ్వాపుకోలేరు

నిర్మాణంలో ఉన్న భవనం ముందు అర్థరాత్రి కుక్కల అరుపులు.. వెళ్లి చూడగా !!

క్యాన్సర్ బారిన పడిన తల్లికోసం ఆ బాలుడు చేసిన పనికి.. కంటతడి ప్రేమ

 

Follow us on