బాత్రూం నుంచి వింత శబ్దాలు.. ఏంటా అని చూసినవారికి షాక్‌

|

Jun 25, 2024 | 6:25 PM

విశాఖ జిల్లా దువ్వాడ రసాలమ్మ కాలనీ..! అక్కడ ఓ ఇంట్లో కుటుంబం నివాసం ఉంటోంది. ఆ ఇంట్లోని బాత్‌రూమ్‌ నుంచి వింత శబ్దాలు వినిపించాయి. దీంతో నెమ్మదిగా వాష్ రూమ్ తలుపు తీసిన వాళ్లకు గుండె ఆగినంత పని అయింది. అక్కడ సీన్‌ చూసి అంతా బయటకు పరుగులు తీశారు. బాత్‌రూమ్‌లో వారికి నాలుగున్నర అడుగుల గోధుమ నాగుపాము బుసలు కొడుతూ కనిపించింది. దెబ్బకు హడలెత్తిపోయిన వారు పరుగెత్తుకొచ్చి ఇరుగుపొరుగువారికి చెప్పారు.

విశాఖ జిల్లా దువ్వాడ రసాలమ్మ కాలనీ..! అక్కడ ఓ ఇంట్లో కుటుంబం నివాసం ఉంటోంది. ఆ ఇంట్లోని బాత్‌రూమ్‌ నుంచి వింత శబ్దాలు వినిపించాయి. దీంతో నెమ్మదిగా వాష్ రూమ్ తలుపు తీసిన వాళ్లకు గుండె ఆగినంత పని అయింది. అక్కడ సీన్‌ చూసి అంతా బయటకు పరుగులు తీశారు. బాత్‌రూమ్‌లో వారికి నాలుగున్నర అడుగుల గోధుమ నాగుపాము బుసలు కొడుతూ కనిపించింది. దెబ్బకు హడలెత్తిపోయిన వారు పరుగెత్తుకొచ్చి ఇరుగుపొరుగువారికి చెప్పారు. వెంటనే స్నేక్స్ సేవర్ సొసైటీ కిరణ్ కుమార్ కు సమాచారం అందించారు. తన బృందంతో కలిసి రంగంలోకి దిగిన కిరణ్ కుమార్.. ఘటనాస్థలికి చేరుకుని, వాష్‌రూమ్‌లో తిష్ట వేసుకుని కూర్చున్న భారీ గోధుమ నాగును చాకచక్యంగా పట్టుకున్నాడు. బంధించే క్రమంలో ఎదురు తిరిగేందుకు ప్రయత్నించింది ఆ పాము. చివరకు ఆ పామును గోనెసంచిలో బంధించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ గోధుమ నాగు అత్యంత విషపూరితమని, చాలా ప్రమాదకరమని తెలిపాడు కిరణ్. గోధుమ రంగులో ఉండే నాగు పాములు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా కనిపిస్తాయట. తలపై నమాకృతిని కలిగి గోధుమ, ముదురు కాఫీ రంగు చారలు కలిగి ఉంటాయి. వయసును బట్టి ఇవి 20 అంగుళాలు మొదలుకొని… దాదాపు 9 అడుగుల వరకు పెరుగుతాయి. వీటికి తోకలో ఉండే చిన్న ముళ్ళలోనూ విషం ఉంటుందంటారు. అందుకే ఈ నాగులను చాలా ప్రమాదకరంగా భావిస్తారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూ.224 కోట్ల సంపద దానం చేసిన యువతి !! ఎందుకంటే??

లైంగిక దాడి, అక్రమ సంబంధాల కేసుల్లో అబార్షన్లకు ఓకే

తిండి నిద్ర మానేసి.. టెన్షన్‌తో చిక్కిపోయి.. జైల్లో స్టార్ హీరోకు దారుణ పరిస్థితి

జైల్లో వెక్కి వెక్కి ఏడుస్తున్న పవిత్ర.. హత్యకు ముందు తెలియదా మరి ??

Nagarjuna: అభిమానికి క్షమాపణ చెప్పిన కింగ్ నాగ్

Follow us on