స్టాన్‌ఫోర్డ్ డిగ్రీ, గూగుల్ ఇంటర్న్.. అయినా దొరకని ఉద్యోగం

Updated on: Jun 04, 2026 | 4:18 PM

స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి పట్టా పొంది, గూగుల్‌లో ఇంటర్న్‌షిప్ చేసిన ఓ ప్రతిభావంతుడు ఉద్యోగం కోల్పోయిన తర్వాత కొత్త అవకాశం కోసం ఇబ్బందులు పడుతున్నాడని సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్ట్ చర్చనీయాంశమైంది. చదువు, నైపుణ్యాలు మాత్రమే విజయానికి హామీ కాదని, మారుతున్న ఉద్యోగ మార్కెట్ పరిస్థితులు కెరీర్‌లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

టెక్ కంపెనీలు లేఆఫ్స్ చేస్తున్నాయి. ఇతర నైపుణ్యాలు ఉన్నా ఉద్యోగం నుంచి తొలగిస్తున్నాయి. టెక్ కంపెనీల్లో ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. మంచి కాలేజీ నుంచి డిగ్రీ పొంది, వృత్తి నైపుణ్యం ఉన్న వారికి పెద్దగా ప్రమాదం ఉండదని చెబుతుంటారు. ఇదే సమయంలో AI నిపుణుల కోసం చూస్తున్నాయి టెక్ కంపెనీలు. కానీ, ఉన్నత విద్యా, వృత్తి నైపుణ్యం ఉన్న తన స్నేహితుడు ఉద్యోగం కోల్పోయిన తర్వాత కొత్త ఉద్యోగం దొరకక ఇబ్బంది పడుతున్న విషయాన్ని సిద్ధార్థ్ అనే వ్యక్తి సోషల్ మీడియా ఎక్స్ వేదికగా చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం టెక్ మార్కెట్లోని దారుణ పరిస్థితులపై చర్చకు దారి తీసింది. ప్రతిదీ ‘సరిగ్గా’ చేస్తే కెరీర్‌లో విజయం ఖాయం అన్న నమ్మకాన్ని సిద్ధార్థ్ ప్రశ్నించడంతో ఈ చర్చ మొదలైంది. తన పోస్ట్‌లో, అతను ఒక విషయం రాసుకొచ్చాడు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొంది, గూగుల్‌లో ఇంటర్న్‌షిప్ సంపాదించి, తన క్లాస్‌లో టాపర్‌గా నిలిచిన వారిలో ఒకడైన తన స్నేహితుడు ఇటీవల ఉద్యోగం కోల్పోయాడని, అప్పటి నుంచి అతనికి తగిన ఉద్యోగం దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ఇప్పుడు తనకు తగిన సరైన ఉద్యోగం వెతుక్కోవడంలో ఇబ్బందులు పడుతున్నాడు. కానీ, అతను అన్నీ సరిగ్గానే చేశాడు కదా? మరెందుకు ఇలా’ అని సిద్ధార్థ ప్రశ్నించాడు. సిద్ధార్థ్ పోస్ట్‌ వైరల్ అయింది. రోజు రోజుకు పెరుగుతున్న పోటీకి , జాబ్‌ మార్కెట్‌కి మధ్య వ్యత్యాసం పెుగుతోందని నెటిజన్లు తెలిపారు. నియామకాల్లో ఇబ్బందులు ఉన్నాయని, అధిక నైపుణ్యాలు ఉన్న వారు సైతం తగిన ఉద్యోగాన్ని సాధించలేకపోతున్నారని తెలిపారు. అయితే సమర్థులైన నిపుణులు కొత్త ఉద్యోగాల ద్వారా గానీ లేదా వ్యాపార ప్రయత్నాల ద్వారా గానీ చివరికి నిలదొక్కుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. చదువులో విజయాలు, ఆకట్టుకునే రెజ్యూమెలు మారుతున్న మార్కెట్ పరిస్థితుల నుంచి కాపాడలేవని మరికొందరు వాదించారు. ఆ పోస్ట్‌కు స్పందిస్తూ, నైపుణ్యాలు చివరికి డిమాండ్‌పై ఆధారపడి ఉంటాయని, అలాగే వ్యక్తులు నియంత్రించలేని ఆర్థిక శక్తుల వల్ల కెరీర్ ఫలితాలు తరచుగా ప్రభావితమవుతాయని ఒకరు అన్నారు. ఈ చర్చ ప్రత్యామ్నాయ వృత్తి మార్గాల వైపు కూడా మళ్లింది. విద్యాసంబంధ వాతావరణంలో రాణించే వ్యక్తులు పరిశోధన వృత్తులకు మరింతగా సరిపోతారని ఒక వ్యాఖ్యాత సూచించారు. విద్యా రంగంపై బలమైన ఆసక్తి ఉన్నవారికి ఉన్నత విద్య, డాక్టరేట్ కార్యక్రమాలను ఆయన సిఫార్సు చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

లైట్ ఆన్, ఆఫ్ చేస్తే చాలు.. ఏడాదికి రూ.30 కోట్ల జీతం!

ఎల్‌నినో ముప్పు.. ఈ ఏడాదికి ఈ పంటలే బెస్ట్.. రేటుకు రేటు, ప్రభుత్వం హామీ

Silver Price: వెండి దిగుమతిపై కేంద్రం ఆంక్షలు.. మళ్లీ ధర కొండెక్కుతుందా?

ఎండల నుంచి తప్పించుకోవడానికి పిచ్చుక మాస్టర్ ప్లాన్.. స్కూటీలోనే అన్నీ

వింత గొడవ.. పట్టణాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న నెమళ్లు

Follow Us