కానిస్టేబుల్‌ను వెంటాడి హతమార్చిన తేనెటీగలు

Updated on: Mar 27, 2026 | 4:52 PM

శ్రీశైలం జలాశయం వద్ద విధి నిర్వహణలో ఉన్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ పిల్లి వీరస్వామి తేనెటీగల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. వందలాది తేనెటీగలు కమ్ముకోవడంతో భయాందోళనలకు గురై గుండెపోటుతో అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనలో మరో ఇద్దరు సిబ్బంది గాయపడ్డారు. బాపట్ల జిల్లాకు చెందిన వీరస్వామి మృతితో కుటుంబ సభ్యులు, ఎస్పీఎఫ్ విభాగంలో తీవ్ర విషాదం నెలకొంది.

శ్రీశైలం జలాశయం సాక్షిగా బుధవారం ఘోర విషాదం చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ పిల్లి వీరస్వామి తేనెటీగల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో డ్యామ్ పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. నంద్యాల జిల్లా శ్రీశైలం డ్యామ్ వద్ద జలాశయం లిఫ్ట్ సమీపంలో వీరస్వామి విధి నిర్వహణలో ఉన్నారు. ఆ సమయంలో అకస్మాత్తుగా తేనెటీగల దండు ఆయనపై విరుచుకుపడింది. వాటి నుంచి తప్పించుకునేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నించారు. అయితే, వందలాది తేనెటీగలు ఒక్కసారిగా కమ్ముకోవడంతో కలిగిన తీవ్ర భయాందోళనల వల్ల ఆయన అక్కడికక్కడే గుండెపోటుకు గురయ్యారు. పక్కనే ఉన్న తోటి సిబ్బంది వెంటనే స్పందించి, ఆయన్ని హుటాహుటిన సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే పరిస్థితి విషమించడంతో వీరస్వామి మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ దాడిలో మరో ఇద్దరు సిబ్బంది కూడా గాయపడినట్లు తెలుస్తోంది. మృతుడు బాపట్ల జిల్లా చీరాల సమీపంలోని గ్రామ నివాసి అని సమాచారం. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎంతో నిబద్ధతతో పనిచేసే వీరస్వామి మృతితో ఎస్పీఎఫ్ విభాగంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రెస్టారెంట్లకు కేంద్రం సీరియస్ వార్నింగ్.. అదనపు ఛార్జీలు వసూలు చేస్తే ఇక అంతే సంగతులు

RCB: బాస్‌ మారారు.. ఆర్సీబీ పేరుకూడా మారుతుందా ??

గుడ్‌ న్యూస్‌.. ఇకపై మధ్యాహ్న భోజనంలో చేపల కూర

Follow Us