ఆకాశంలో అద్భుత దృశ్యం.. వైరల్ అవుతున్న డ్రోన్ షో
శ్రీకాకుళంలో రథసప్తమి వేడుకల సందర్భంగా నిర్వహించిన డ్రోన్ షో నగర వాసులను మంత్రముగ్ధులను చేసింది. వందలాది డ్రోన్లు ఆకాశంలో రంగురంగుల వెలుగులతో సిక్కోలు రథసప్తమి, సూర్యభగవానుడి రూపం, ఏపీ మ్యాప్ వంటి ప్రత్యేక ఆకృతులను ప్రదర్శించి జిల్లా విశిష్టతను చాటాయి. వేలాది మంది ప్రజలు ఈ అద్భుత దృశ్యాలను వీక్షించి, శ్రీకాకుళం చరిత్రలో ఇదొక మైలురాయిగా అభివర్ణించారు.
శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం రాత్రి ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. రథసప్తమి వేడుకల సందర్భంగా నిర్వహించిన వందలాది డ్రోన్ల ప్రదర్శన నగర వాసులను మంత్రముగ్ధులను చేసింది. డ్రోన్లు క్రమపద్ధతిలో ఎగిరి రంగురంగుల వెలుగులతో ప్రత్యేక ఆకృతులను ఆవిష్కరించి జిల్లా విశిష్టతను చాటిచెప్పాయి. ప్రదర్శన ప్రారంభంలోనే ఆకాశంలో ‘సిక్కోలు రథసప్తమి ఉత్సవాలు 2026’ అనే అక్షరాలు మెరిసాయి. భానుడి రథం, సూర్యభగవానుడి దివ్య రూపం, అష్టలక్ష్మి స్వరూపం లక్ష్మీదేవి ఆకారం కనిపించాయి. 75 ఇయర్స్ ఆఫ్ శ్రీకాకుళం, ‘పలాస క్యాస్యు’, పొందూరు ఖాదీ చిహ్నం వంటి ఆకృతులు ఆకట్టుకున్నాయి. ఆంధ్రప్రదేశ్, ఇండియా మ్యాప్‌లను డ్రోన్ల ద్వారా ప్రతిష్టాత్మకంగా చూపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రాలను కూడా డ్రోన్లు ఆకాశంలో ప్రదర్శించాయి. వేలాది ప్రజలు తమ సెల్‌ఫోన్లలో ఈ అద్భుత దృశ్యాలను రికార్డ్ చేశారు. జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారుల పర్యవేక్షణలో జరిగిన ఈ డ్రోన్ షో, శ్రీకాకుళం నగర చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిందని ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Renu Desai: మరో జన్మ వరకు ఎందుకు ?? ఈ జన్మలోనే అన్నీ క్లియర్ చేస్తా
Mega158: ‘జన నాయగన్’ ఎఫెక్ట్.. చిక్కుల్లో చిరు నెక్స్ట్ మూవీ ??
రాజా సాబ్ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారంటూ.. సైబర్ పోలీసులకు SKN ఫిర్యాదు
Anil Ravipudi: అసాధ్యుడువయ్యా… అర్థ రూపాయితో పది రూపాయలు కొట్టేశావ్ మరి
