టీడీపీ జెండాతో సెల్‌ టవర్‌ ఎక్కిన వ్యక్తి.. సత్యసాయి జిల్లాలో హైటెన్షన్

Updated on: Jan 28, 2026 | 8:28 AM

కొత్తచెరువులో ఉద్రిక్తత నెలకొంది. లక్ష్మీనారాయణ అనే వ్యక్తి బీఎస్‌ఎన్‌ఎల్ సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. కుమార్తె విడాకుల కేసులో అల్లుడి నుంచి రావాల్సిన బంగారం విషయంలో పోలీసుల అలసత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారపార్టీ వ్యక్తి అయిన తనకే న్యాయం జరగకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండల కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కదిరేపల్లికి చెందిన లక్ష్మీనారాయణ అనే వ్యక్తి బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంపై ఉన్న సెల్ టవర్‌ను ఎక్కి హల్‌చల్‌ చేశాడు. సెల్‌ టవర్‌పై వ్యక్తిని గమనించిన స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. లక్ష్మీనారాయణ టిడిపి జెండా పట్టుకుని సెల్ టవర్ ఎక్కడంతో స్థానికులు ఏమై ఉంటుందా అని చర్చించుకున్నారు. లక్ష్మీనారాయణ తన కుమార్తె విషయంలో న్యాయం జరుగడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తూ సెల్ టవర్ పైకి నిరసనకు దిగాడు. తన కుమార్తెకు విడాకులయ్యాయని, అయితే అల్లుడి నుంచి తమకు రావాల్సిన తమ బంగారం పోలీసులు ఇప్పించడంలేదని నిరసనచేపట్టాడు. అధికారపార్టీకి చెందిన వ్యక్తినైన తనకే పోలీసులు అలసత్వం చూపుతున్నారంటే.. ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశాడు లక్ష్మీ నారాయణ. కాగా, ఘటనపై సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సెల్ టవర్ పై ఉన్న లక్ష్మీనారాయణను సురక్షితంగా కిందకు దించేందుకు చర్యలు చేపట్టారు. కొత్తచెరువు పోలీస్ స్టేషన్ సిఐ మారుతి శంకర్, లక్ష్మీనారాయణతో ఫోన్లో మాట్లాడుతూ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఈక్రమంలో ఆ ప్రాంతంలో పెద్దసంఖ్యలో స్థానికులు గుమిగూడారు. ప్రతికూల పరిస్థితులను నివారించడానికి పోలీసులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వారెవా.. లిటిల్ జీనియస్ రూబిక్ క్యూబ్ ఆర్ట్‌తో రికార్డులు

ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? రోడ్డు కోసం గుర్రాలపై వెళ్లి వినతి పత్రం

మందుకు డబ్బుల్లేక.. ఆర్టీసీ బస్ కాజేశాడు.. మహానుభావుడు

కూచిపూడి కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన నాట్యమయూరి