ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు

Updated on: May 08, 2026 | 12:31 PM

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో దొంగలు రెచ్చిపోయారు. IDFC బ్యాంక్ ATMను గునపాలతో పగలగొట్టలేక, బొలెరో వాహనానికి తాళ్లతో కట్టి పునాదులతో సహా పెకలించారు. సుమారు ₹10 లక్షల నగదు ఉన్న మెషీన్‌ను వాహనంలో వేసుకుని పారిపోయారు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. వృత్తిపరమైన ముఠా పనేనని పోలీసులు భావిస్తున్నారు, కేసు ఛేదించడం సవాల్‌గా మారింది.

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఐడీఎఫ్‌సీ బ్యాంకు ఏటీఎంను లక్ష్యంగా చేసుకున్న ముగ్గురు దొంగలు, ఏకంగా ఏటీఎం మెషీన్‌నే పెకలించుకు పోయారు. అత్యంత పక్కా ప్లాన్‌తో వచ్చిన ఈ ముఠా, సినిమా సీన్‌ను తలపించేలా ఈ చోరీకి పాల్పడ్డారు. ముందుగా దొంగలు వచ్చిన బొలేరో వాహనంతో ఏటీఎం కేబిన్‌ అద్దాలు పగలగొట్టి…లోపలికి చొరబడిన దొంగలు గునపాలతో మెషీన్‌ను బద్దలుగొట్టడానికి ప్రయత్నించారు. అది సాధ్యం కాకపోవడంతో తమ వద్ద ఉన్న బలమైన తాళ్లను ఏటీఎం మెషీన్‌కు కట్టారు. ఆ తాళ్లను బయట సిద్ధంగా ఉంచిన బొలెరో వాహనానికి కట్టి బలంగా లాగడంతో, మెషీన్ పునాదులతో సహా ఊడి బయటకు వచ్చేసింది. ఈ ధాటికి ఏటీఎం కేబిన్ పూర్తిగా ధ్వంసమైంది. అనంతరం ముగ్గురు నిందితులు ఆ భారీ మెషీన్‌ను తమ వాహనంలో వేసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. చోరీ జరిగిన సమయంలో ఏటీఎం మెషీన్‌లో సుమారు రూ. 10 లక్షల నగదు ఉన్నట్లు బ్యాంకు సిబ్బంది ప్రాథమికంగా నిర్ధారించారు. దొంగలు ఏటీఎం మెషీన్‌తో బత్తలపల్లి వైపు వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ తతంగమంతా అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పక్కా ప్లాన్‌తో, పనిముట్లతో వచ్చి మరీ ఈ చోరీకి పాల్పడటం చూస్తుంటే ఇది వృత్తిపరమైన దొంగల ముఠా పనిగా పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసును ఛేదించడం ఇప్పుడు పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే

అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే..

మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!

ప్రాణాలను కాపాడిన.. రియల్‌ “హీరో” ఈ ఎలుక !!

దమ్ముంటే పట్టుకోరా షెకావత్.. అంటూ పోలీసులకు దొంగ సవాల్‌ !!

Follow Us