రీల్స్ పిచ్చి.. ప్రమాదవశాత్తూ గన్‌ పేలడంతో..

Updated on: Mar 20, 2026 | 5:43 PM

రీల్స్ పిచ్చితో యువత ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలన్న ఆశతో ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఢిల్లీలో 28 ఏళ్ల పవన్, తుపాకీతో రీల్ చిత్రీకరిస్తూ దురదృష్టవశాత్తు కాల్చుకుని మరణించాడు. సోషల్ మీడియా రీల్స్ వల్ల జరుగుతున్న ఈ విషాద ఘటనలు యువతలో అవగాహన లోపాన్ని, ప్రమాదకరమైన ధోరణులను సూచిస్తున్నాయి.

రీల్స్ పిచ్చితో ఈ మధ్య యువత ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలన్న ఆశతో అనవసరమైన స్టంట్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కొందరు రోడ్లపై బైక్‌లతో ప్రమాదకరమైన విన్యాసాలు చేయడం.. స్పీడ్‌గా ఎదురొస్తున్న రైలును వీడియో తీయబోయి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఢిల్లీలో అలాంటి దారుణమే జరిగింది. దల్లుపురా గ్రామానికి చెందిన 28 ఏళ్ల పవన్ తుపాకీ చేతపట్టి రీల్స్‌ కోసం పోజివ్వాలని ప్లాన్‌ చేసాడు. తన కజిన్ హిమాన్షుతో కలిసి ఓ గదిలో రీల్‌ రికార్డ్ చేస్తున్నాడు. హిమాన్షు మొబైల్ లో వీడియో తీస్తుండగా, పవన్ ఒక పిస్టల్‌లో మ్యాగజైన్ పెట్టి లోడ్ చేశాడు. మొదట్లో హిమాన్షు అతడికి గన్‌లోకి మ్యాగజీన్‌ను ఎలా పెట్టాలో సూచించాడు. బటన్ నొక్కగానే అది లోపలికి వెళుతుందని చెప్పాడు. ఆ ప్రకారమే పవన్ మ్యాగజీన్‌ను తుపాకీలో పెట్టాడు. తుపాకీ ఛాంబర్‌లో తూటా లోడ్ అయ్యేలా చేశాడు. ఇదంతా కెమెరాతో రికార్డు చేస్తున్న హిమాన్షు వెంటనే పవన్‌ను అలర్ట్‌ చేశాడు. ట్రిగ్గర్ నొక్కవద్దని హెచ్చరించాడు. ‘చలానా మత్ భాయ్’ అంటే కాల్చకు భయ్యా అంటూ హెచ్చరించాడు. ‘అరె వద్దు’ అని మళ్లీ చెబుతున్నా పవన్ వినలేదు. తుపాకీని ఎడమ వైపు ఛాతీకి ఆనించి, ఒకసారి కెమెరా వైపు చూసి నవ్వుతూ ట్రిగ్గర్ నొక్కాడు. ఒక్కసారిగా బుల్లెట్ దూసుకెళ్లడంతో పవన్ నేలపై కుప్పకూలాడు. క్షణాల్లో జరిగిన ఈ ఘోరంతో వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు పవన్‌ను వసుంధర ఎన్‌క్లేవ్‌లోని ధర్మశిల ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతూ పవన్ ప్రాణాలు విడిచాడు. ఆసుపత్రి వర్గాల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ప్రాథమిక విచారణలో ఆ లైసెన్స్డ్ పిస్టల్ హిమాన్షుదేనని పోలీసులు గుర్తించారు. ఆ తుపాకీతో పాటు అందులో ఉన్న పది తూటాలను సీజ్ చేశారు. వీడియో రికార్డ్ చేసిన మొబైల్ ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. పవన్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం లాల్ బహదూర్ శాస్త్రి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మహిళను చంపినంత పని చేసిన రోబో అరెస్ట్ !!

నిమ్మరసానికి ‘గ్యాస్ ఛార్జ్’.. బిల్లు చూసి కస్టమర్ షాక్ !!

ఏం చేస్తాం.. నేను కష్టపడి కట్టుకున్న ఇల్లు సుడిగాలి సుధీర్ వశమైంది

వరల్డ్‌ కప్‌కు సెలక్ట్ చేయలేదనే కోపంతో సినిమాల్లోకి.. కట్ చేస్తే స్టార్ డైరెక్టర్‌గా..

వాటి మీద ఆసక్తితో.. భారీగా డబ్బును చేజార్చుకున్నాడు.. అయితే..

Follow Us