Snake in toilet: వాష్‌రూమ్‌‌లో టాయిలెట్‌ క్యాప్‌ ఓపెన్‌.. సీన్ చూసి గుండె గుబేల్‌..! వయమ్మో….

Updated on: Sep 27, 2022 | 9:47 AM

ఒక్కోసారి జీవితంలో ఎదురైన సంఘటనలు గుండె ఉలిక్కిపడేలా చేస్తాయి. కళ్ల ముందు కనిపించే భయానక దృశ్యాలు గుండె గుబేల్ మనిపిస్తాయి. తాజాగా అమెరికాకు చెందిన ఓ వ్యక్తికి ఇలాంటి


ఒక్కోసారి జీవితంలో ఎదురైన సంఘటనలు గుండె ఉలిక్కిపడేలా చేస్తాయి. కళ్ల ముందు కనిపించే భయానక దృశ్యాలు గుండె గుబేల్ మనిపిస్తాయి. తాజాగా అమెరికాకు చెందిన ఓ వ్యక్తికి ఇలాంటి ఓ షాకింగ్ ఇన్సిడెంట్‌ ఎదురైంది. వాష్‌రూమ్‌కు వెళ్దామని టాయిలెట్ క్యాప్‌ ఓపెన్‌ చేయగా కనిపించిన దృశ్యంతో ఒక్కసారిగా గుండె జారినంత పనైంది. అందులో ఓ పాము కదులుతూ కనిపించింది. దీంతో ఒక్కసారిగా షాకైన ఇంటి యజమాని వెంటనే వెస్ట్రన్‌ క్యాప్ ను మూసేసి అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు. వెంటనే స్నేక్ క్యాచర్లకు సమాచారం ఇవ్వడంతో.. అక్కడికి చేరుకున్న సిబ్బంది ఆ పామును తీసుకొని వెళ్లిపోయారు. అయితే, టాయిలెట్‌లోకి ఇలా అనుకోని అతిథి దర్శనం ఇవ్వడం ఇది మూడోసారని సదరు ఇంటి యజమాని చెప్పడం గమనార్హం. తాజాగా పాము కనిపించిన ఘటనకు సంబంధించి వివరాలను అలబామా పోలీసులు ఫేస్ బుక్ వేదికగా పంచుకున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..

Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..

Published on: Sep 27, 2022 09:47 AM