Kurnool: వ్యవసాయ అధికారి కార్యాలయంలో వింత శబ్ధాలు.. ఏంటా అని చెక్ చేయగా

| Edited By: Ram Naramaneni

Aug 05, 2023 | 8:56 PM

ఆదోని మండలం వ్యవసాయ కార్యాలయంలోనికి దాదాపు 7 అడుగుల జెర్రీ పోతు ఎలా వచ్చిందో ఉద్యోగులు ఆలోచనలో పడ్డారు. ఆఫీసులోకి దూరిన పాము దాదాపు అరగంట సేపు ఎక్కడ నక్కిందో కనిపించలేదు. స్నేక్ క్యాచర్ గోపిని పిలిపించి ఆ పామును వెతికించారు. ఎట్టకేలకు ఆఫీసులో మూలలో పాము ఉండడం గమనించి చాకచక్కంగా పాముని పట్టుకొని బయటికి తీసుకువచ్చి చూడగా దాదాపు 6 అడుగుల నుంచి ఏడు అడుగుల వరకు పొడవుంది ఆ పాము. 

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ సమీపంలో ఉన్న ఆదోని మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఆకస్మాత్తుగా ఓ పాము బుసలు కొడుతూ ఉద్యోగులకు కనిపించింది. దీంతో ఒక్కసారిగా ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. కార్యాలయం నుంచి పరుగులు తీశారు. అసలు రద్దీగా ఉండే ప్రాంతంలో ఉన్న ఆదోని మండలం వ్యవసాయ కార్యాలయంలోనికి దాదాపు 7 అడుగుల జెర్రీ పోతు ఎలా వచ్చిందో ఉద్యోగులు ఆలోచనలో పడ్డారు. ఆఫీసులోకి దూరిన పాము దాదాపు అరగంట సేపు ఎక్కడ నక్కిందో కనిపించలేదు. స్నేక్ క్యాచర్ గోపిని పిలిపించి ఆ పామును వెతికించారు. ఎట్టకేలకు ఆఫీసులో మూలలో పాము ఉండడం గమనించి చాకచక్కంగా పాముని పట్టుకొని బయటికి తీసుకువచ్చి చూడగా దాదాపు 6 అడుగుల నుంచి ఏడు అడుగుల వరకు పొడవుంది ఆ పాము.  స్నేక్ క్యాచర్ గోపి దాన్ని ఓ కవర్లో బంధించి ఆదోని పట్టణ శివారులలోని కొండ ప్రాంతంలో వదిలేశాడు. పాముని తీసుకుపోవడంతో అధికారులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి