తల తెగిన కోపంతో తననే కాటేసుకున్న పాము
సాధారణంగా విష సర్పాలు తమ పరిసరాల్లో ఏదైనా అలజడిని గమనిస్తే వెంటనే అప్రమత్తమవుతాయి. అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తాయి. అలా పారిపోయే క్రమంలో ఏ అడ్డంకి ఎదురైనా ఎగబడి కాటేస్తాయి. నాగుపాము, రక్తపింజరలాంటి పాములు చాలా ప్రమాదకరం. నాగుపాము కరిస్తే నాడీ వ్యవస్థపై..
సాధారణంగా విష సర్పాలు తమ పరిసరాల్లో ఏదైనా అలజడిని గమనిస్తే వెంటనే అప్రమత్తమవుతాయి. అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తాయి. అలా పారిపోయే క్రమంలో ఏ అడ్డంకి ఎదురైనా ఎగబడి కాటేస్తాయి. నాగుపాము, రక్తపింజరలాంటి పాములు చాలా ప్రమాదకరం. నాగుపాము కరిస్తే నాడీ వ్యవస్థపై, రక్తపింజరి కరిస్తే కండరాలపై విష ప్రభావం పడి కొన్ని నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోతారు. అలాంటి పాములు ఆత్మరక్షణ కోసం ఇతర జీవులను కాటేయడం సర్వసాధారణం. కానీ ఇక్కడ ఓ విష సర్పం తనను తాను కసిగా కాటేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. ఈ వీడియోలో ఓ పాము తల తెగిపోయి ఓ చోట పడి ఉంది. అయినా ఆ పాము ప్రాణాలు కోల్పోలేదు. దేహభాగం ఇంకా కొట్టుకుంటోంది. అలా కొట్టుకుంటూ కొట్టుకుఒటూ పాము దేహం వచ్చి తెగిపోయి పక్కన పడివున్న తలకు తగిలింది. అంతే ఆ తల నోరు తెరచి తన దేహాన్ని తనే గట్టిగా కాటేసి పట్టుకుంది. ఆ కాటువల్ల కలిగిన మంటకు పాము దేహం ఒక్కసారిగా మరింత వేగంతో కొట్టుకోవడం చూస్తే ఎవరికైనా ఒళ్లు జలదరిస్తుంది. ఈ షాకింగ్ వీడియోను ఓ ట్విట్టర్ యూజర్ తన సోషల్‌మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఇప్పటికే ఈ వీడియోను 5 మిలియన్లమందికి పైగా వీక్షించారు. లక్షన్నరమంది లైక్ చేశారు. వేలమంది రియాక్టవుతూ తమ స్పందన తెలియచేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లక్నోలో పోకిరి సినిమా సీన్ రిపీట్.. నెట్టింట వీడియో వైరల్
డబ్బు కోసం వృద్ధుడి మృతదేహాన్ని రెండేళ్ళ పాటు ఫ్రీజర్‌లో పెట్టి
క్రేజీ సాంగ్‌కు మెట్రో సిబ్బంది హుషారైన స్టెప్పులు..
ఆన్‌లైన్‌లో కుక్కర్ ఆర్డర్ చేస్తే.. పుర్రె పంపించారు
నడిరోడ్డుపై రెచ్చిపోయిన అమ్మాయిలు.. హగ్గులు.. ముద్దులు..