అన్న కోసం అమ్మతోనే గొడవపడిన చిన్నారి.. నెట్టింట వైరల్ అవుతున్న క్యూట్ వీడియో
ఏదో పొరపాటు చేయడంతో ఓ బాలుడిని తన తల్లి కొడుతుంది. అది చూసి, పక్కనే నిలబడి ఉన్న ఆ బాలుడి చిన్నారి చెల్లికి చాలా కోపం వచ్చింది. అమ్మ తన అన్నను కొట్టడం ఆమెకు బొత్తిగా నచ్చలేదు.
ఏదో పొరపాటు చేయడంతో ఓ బాలుడిని తన తల్లి కొడుతుంది. అది చూసి, పక్కనే నిలబడి ఉన్న ఆ బాలుడి చిన్నారి చెల్లికి చాలా కోపం వచ్చింది. అమ్మ తన అన్నను కొట్టడం ఆమెకు బొత్తిగా నచ్చలేదు. అందుకే తన అన్నను కొట్టొద్దంటూ ‘ఛోడ్..ఛోడ్ ‘ అంటూ వాళ్లమ్మను వారిస్తుంది. అయినప్పటికీ, తల్లి ఆ అబ్బాయిని వదలదు. అలాగే కొడుతూ ఉంటుంది. దాంతో ఆ చిన్నారి చాలా కోపంగా తల్లివైపు వేలు చూపిస్తూ.. ‘వదలమన్నానా’ అంటూ గట్టిగా అరుస్తుంది. తన తల్లిని బెదిరిస్తుంది. మొత్తానికి తన అన్నను కాపాడుకుంది. చిన్నారి ప్రదర్శించిన తెగువను చూసి తల్లి కూడా మురిసిపోయి, ముద్దాడుతుంది. ఈమె చూపిన తెగువను చూసి నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ వీడియో చూసి నెటిజన్లు తెగ ముచ్చటపడిపోతున్నారు. ‘అన్న, చెళ్లి ప్రేమ ఎప్పటికీ తగ్గదు..’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఈ వీడియోను వేలాదిమంది వీక్షించారు. ‘నిజంగా, సోదరుడు, సోదరి మధ్య సంబంధం చాలా అందమైనది’ అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మందు కోసం ‘మగువ’ ఆరాటం.. ఏం చేసిందో చూడండి !!
ఏంటి బాసూ.. గూగుల్ మ్యాప్‌ను గుడ్డిగా ఫాలో అయ్యావా ఏంటి ??
Dutee Chand: గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకున్న అథ్లెట్ ద్యుతీచంద్ !!
సాయిబాబా పాదాలు మొక్కుతూ ప్రాణం వదిలేశాడు !!
క్లాస్‌రూంలో డాన్స్ అదరగొట్టిన టీచర్.. మండిపడుతున్న నెటిజన్లు