ఈ నర్స్ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
మెదక్ ఆసుపత్రిలో అమానవీయ ఘటన. నర్సు అక్తరీ బేగం, పుట్టిన పసికందు చనిపోయిందని తల్లిని నమ్మించి, ఆ బిడ్డను ₹1.5 లక్షలకు విక్రయించింది. ఈ శిశువు అక్రమ రవాణా వ్యవహారం వెలుగులోకి రావడంతో పోలీసులు నర్సుతో పాటు మధ్యవర్తి, కొనుగోలు చేసిన దంపతులను అరెస్ట్ చేశారు. కలెక్టర్ ఆదేశాలతో ఆసుపత్రిని సీజ్ చేశారు. ఈ ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది.
ఆస్పత్రిలో వైద్యం కోసం.. డాక్టర్ తర్వాత అంతగా నమ్మేది నర్సునే. ఆస్పత్రిలో వైద్యులు రోగికి చేయాల్సిన చికిత్స గురించి నర్సుకి వివరించి పేషెంట్ బాధ్యతను వారికి అప్పగిస్తారు. అయితే, ప్రాణాలు కాపాడాల్సిన ఆ నర్సే, కాసులకు కక్కుర్తిపడి ఏమాత్రం కనికరం లేని కసాయిగా వ్యవహరించింది. పుట్టిన పసికందు చనిపోయిందని కన్నతల్లిని నమ్మించి, ఆ చిన్నారిని లక్షా యాభై వేల రూపాయలకు వేరేవాళ్లకు అమ్మేసింది. ఈ అమానవీయ ఘటన మెదక్ జిల్లాలో వెలుగుచూసింది. పాపన్నపేట మండలం లక్ష్మీనగర్ తండాకు చెందిన నస్రా ఫాతిమా ఏడు నెలల గర్భిణి. ఇటీవల ఆమె మెదక్ బస్టాండ్‌లో ఉన్న సమయంలో కోతులు ఒక్కసారిగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించగా, వైద్యులు శస్త్రచికిత్స చేసి డెలివరీ చేశారు. ఫాతిమా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే, అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సు అక్తరీ బేగం కన్ను ఆ పసికందుపై పడింది. బిడ్డ పుట్టిన వెంటనే ఆ శిశువు చనిపోయిందని ఫాతిమాను నమ్మించిన నర్సు, గుట్టుచప్పుడు కాకుండా ఆ పాపను రూ. 1.50 లక్షలకు విక్రయించింది. తన బిడ్డ మరణించిందని భావించిన ఆ తల్లి పుట్టెడు దుఃఖంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లిపోయింది. ఐదు రోజుల తర్వాత మెదక్‌కు వచ్చిన నస్రా ఫాతిమాకు ఓ గుర్తుతెలియని వ్యక్తి ద్వారా తన బిడ్డ బతికే ఉందన్న నిజం తెలిసి షాకైంది. వెంటనే ఆస్పత్రికి చేరుకుని అక్కడి వైద్యులను నిలదీశారు. భర్త అస్లాంఖాన్ తో కలిసి మార్చి 3న మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో..ఆసుపత్రి నర్సు అక్తరీ బేగం.. మెదక్ పట్టణంలోని గోల్కోండ వీధికి చెందిన నౌసిన్ ఉన్నీసాకు పసికందును అప్పగించి నట్లు తేలింది. ఆమె.. ఆ శిశువును సిద్దిపేటకు చెందిన మహమ్మద్ ఇక్బాలుద్దీన్, సదీయ సుల్తానా దంపతులకు లక్షా యాభై వేలకు విక్రయించినట్లు గుర్తించారు. లక్షా నలబై వేలు నర్సు తీసుకొని, 10 వేలు నౌసిన్ ఉన్నిసాకు ఇచ్చారు. పోలీసులు శిశువును సిద్దిపేట నుంచి తీసుకొచ్చి, మెదక్ సఖి కేంద్రంలో అప్పగించారు. నర్సుతో పాటు మధ్యవర్తి, పాపను కొనుగోలు చేసిన దంపతులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ ఘటనపై కలెక్టర్ ప్రతిమాసింగ్ విచారణకు ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జిల్లా వైద్యాధికారి శ్రీరామ్, సదరు ఆసుపత్రిని సీజ్ చేశారు. ఆస్పత్రిలో పని చేస్తున్న నర్సుల వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని యాజమాన్యానికి సంబంధం లేదని నిర్వాహకులు చెబుతున్నారు. విచారణకు పూర్తిగా సహకరిస్తామని ఆస్పత్రి నిర్వాహకులు తెలిపారు. పూర్తిస్థాయి విచారణ తర్వాత బాధ్యులు, సహకరించిన వారిపైనా చర్యలు ఉంటాయని అధికారులు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్ మెషీన్‌లో పెట్టి..
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే..