రైలు ఇంజిన్‌ చెక్‌ చేస్తున్న పైలట్‌.. అక్కడ మనిషి తలను చూసి గుండె గుభేల్‌

Updated on: Jul 31, 2026 | 3:40 PM

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం రైల్వే స్టేషన్‌లో రైలు ఇంజిన్‌లో వ్యక్తి తల ఇరుక్కుపోవడం కలకలం రేపింది. మలుగూరు సమీపంలో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి తల రైలు ఢీకొట్టడంతో ఇంజిన్‌లో చిక్కుకుపోయిందని పోలీసులు గుర్తించారు. రాత్రి చీకటిలో విషయం తెలియక లోకో పైలట్ సుమారు 15 కిలోమీటర్లు రైలును నడిపారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం రైల్వే స్టేషన్‌లో ఓ భయానక ఘటన జరిగింది. రైలు బయలుదేరే ముందు లోకో పైలట్ రైలు ఇంజిన్‌ను సాధారణంగా తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో టార్చ్ లైట్ వేసి చూస్తుండగా, రైలు ఇంజన్ ముందు భాగంలో ఓ మనిషి తలకాయ ఇరుక్కుని కనిపించడంతో ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే ఆయన రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. హిందూపురం రాకముందు మలుగూరు రైల్వే స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. రైలు వేగంగా ఢీకొనడంతో ఆ వ్యక్తి తల తెగిపోయి నేరుగా ఇంజన్ భాగంలో ఇరుక్కుపోయింది. రాత్రి వేళ కావడం, ఏదో పడిందనే భావనతో లోకో పైలట్ దాదాపు 15 కిలోమీటర్ల దూరం రైలును అలాగే నడుపుతూ వచ్చేశారు. మృతుడిని కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లాకు చెందిన రఘునాథ్‌గా పోలీసులు గుర్తించారు. మద్యం, పేకాటకు బానిసై అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు మృతదేహాన్ని హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫేస్‌బుక్ ఫ్రెండ్ ఆశల ఎర.. రూ.1.75 కోట్లు పోగొట్టుకున్న మహిళ!

TTD: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా? బీ అలర్ట్‌!

Loading...
Unable to load recommendations.
Follow Us