అందాల పక్షి ఆఖరి పోరాటం.. అంతరించిపోతున్న జాతి
కేవలం 9 సెం.మీ పొడవుండే బ్లాక్-బ్రెస్టెడ్ పఫ్‌లెగ్ హమ్మింగ్ బర్డ్ తీవ్ర అంతరించిపోతున్న జాతి. ఈక్వెడార్ జాతీయ చిహ్నమైన ఈ అద్భుతమైన పక్షి ప్రస్తుతం కేవలం 150-200 మాత్రమే మిగిలి ఉన్నాయి. వ్యవసాయం, పశుగ్రాసం కోసం అడవుల నరికివేత వల్ల దీని సహజ ఆవాసం నాశనమైపోతోంది. అండీస్ పర్వతాలలోని మేఘ అడవులలో నివసించే ఈ పక్షులను కాపాడటానికి జోకోటోకో ఫౌండేషన్ కృషి చేస్తోంది.
ఇది కేవలం 9 సెంటీమీటర్ల పొడవుండే చిన్ని పిట్ట. ప్రపంచవ్యాప్తంగా హమ్మింగ్ బర్డ్‌గా గుర్తింపు పొందిన దీని అసలు పేరు.. ‘బ్లాక్–బ్రెస్టెడ్ పఫ్‌లెగ్’. చూసేవారికి దేవుడు పనిగట్టుకుని మరీ సృష్టించిన అందమైన కళాఖండమా అనిపించే ఈ జీవి.. మనుగడ ఇప్పుడు ప్రమాదంలో పడిపోయింది. ఈక్వెడార్ జాతీయ చిహ్నమైన ఈ హమ్మింగ్ బర్డ్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అంతరించిపోతున్న జాతులలో ఒకటిగా నిలిచింది. అండీస్ పర్వతాల పొగమంచులో, మేఘాలను తాకే ఎత్తయిన అడవుల మధ్య ఈ అపురూపమైన అందాల జీవి ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతోంది. దురదృష్టవశాత్తూ, ఈ అందమైన పక్షులు ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద కేవలం 150 నుండి 200 లోపు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం మనిషి స్వార్థమే.. పశువుల మేత, వ్యవసాయం కోసం అడవులను నరికేయడంతో ఈ పిట్టలకు గూడు లేకుండా పోతోంది. ఇవి సముద్ర మట్టానికి సుమారు 3,500 మీటర్ల ఎత్తులో ఉండే ఆండీస్ అడవుల్లోనే బతకగలవు. ఆ ప్రాంతాలే ఇప్పుడు వ్యవసాయ భూములుగా మారిపోతున్నాయి. ఈ పక్షులను కాపాడేందుకు అడవులను మళ్లీ పెంచేందుకు ‘జోకోటోకో ఫౌండేషన్’ తీవ్ర కృషి చేస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bangladesh: మొండికేసిన బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్! వరల్డ్ కప్ నుంచి అవుట్
కేదార్‌నాథ్, బదరీనాథ్ ప్యానల్ కీలక నిర్ణయం
తెలంగాణ భవన్ లో స్పెషల్ స్కిట్.. ఆయన పాత్ర చూస్తే పొట్ట చెక్కలవ్వాల్సిందే
Khammam: నేను చస్తే మీకు హ్యాపీనా? బోరున ఏడ్చేసిన గవర్నమెంట్ టీచర్ గౌతమి
Garimella Balakrishna Prasad: మరణానంతరం గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ కు పద్మశ్రీ పురస్కారం
