ఆహా..రావులపాలెంలో సంక్రాంతి పండుగ ఘుమఘుమలు
కోనసీమలోని రావులపాలెంలో సంక్రాంతి సందడి కోడి పందాలతోపాటు ఘుమఘుమలాడే నాన్ వెజ్ విందులతో పతాక స్థాయికి చేరుకుంది. చికెన్, చేపలు, మటన్, రొయ్యలు, బిర్యానీ వంటి పదుల సంఖ్యలో వంటకాలతో కోనసీమ ఆతిథ్యాన్ని రుచి చూపించడానికి విస్తృత ఏర్పాట్లు చేశారు. దూరం నుంచి వచ్చిన వారందరికీ ఈ ప్రత్యేక భోజనం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.
కోనసీమ జిల్లాలోని రావులపాలెం సంక్రాంతి వేడుకలతో సందడిగా మారింది. ఒకవైపు కోడి పందాల జోరు, మరోవైపు నోరూరించే వంటకాల గుమగుమలతో పండుగ వాతావరణం నెలకొంది. సంక్రాంతికి వచ్చిన అతిథుల కోసం కోనసీమ ప్రత్యేకమైన ఆతిథ్యాన్ని అందిస్తోంది. చికెన్, చేపలు, మటన్, రొయ్యల వంటి పదుల సంఖ్యలో నాన్ వెజ్ వంటకాలు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా, కనుమ రోజున పెద్ద ఎత్తున విందు భోజనాలు జరుగుతాయి. తెలంగాణ, బెంగళూరుతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులు కోనసీమ నాన్ వెజ్ రుచులను ఆస్వాదిస్తున్నారు. కోడి పందాల బర్రెల వద్ద ప్రత్యేకంగా టెంట్లు వేసి, అనేక రకాల వంటకాలు సిద్ధం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
టాలీవుడ్ కు సెకండ్ హోమ్ గా మారుతున్న జపాన్ వీడియో
కర్మకాండకు రెడీ చేస్తుండగా.. బతికే ఉన్నానంటూ ఫోన్!
టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్ ఎక్కండి!
రైలు 2 గంటలు లేటైతే అవన్నీ ఫ్రీ… IRCTC రూల్ మీకు తెలుసా?
