ఒకే విమానంలో 33 మంది గర్భిణీ స్త్రీలు.. విచారించగా బిత్తరపోయే నిజాలు !!

Updated on: Feb 21, 2023 | 8:55 AM

సాధారణంగా గర్భిణీలు ప్రయాణాలు చేయడం అంత క్షేమకరం కాదు. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంటి నుంచి కాస్త దూరం ప్రయాణిస్తేనే ఇబ్బంది పడే గర్భిణీలు..

సాధారణంగా గర్భిణీలు ప్రయాణాలు చేయడం అంత క్షేమకరం కాదు. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంటి నుంచి కాస్త దూరం ప్రయాణిస్తేనే ఇబ్బంది పడే గర్భిణీలు.. ఏకంగా దేశాలే దాటిపోతున్నారు. సరిగ్గా నెలలు నిండిన సమయంలో తమ దేశం వీడి.. వేరే దేశానికి క్యూ కడుతున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు నెలల వ్యవధిలోనే ఏకంగా 5 వేల మందికిపైగా నిండు గర్భిణీ స్త్రీలు దేశం దాటి వెళ్లారు. ఎందుకంటే.. గత కొద్ది నెలలుగా రష్యాకు చెందిన 5 వేల మందికి పైగా గర్భిణీ స్త్రీలు తమ దేశం వీడి అర్జెంటినాకు వెళ్లారు. తాజాగా ఒకే విమానంలో 33 మంది నిండు గర్భిణీ స్త్రీలు అర్జెంటినాకు ప్రయాణం చేయడం సంచలనంగా మారింది. ఈ గర్భిణీ స్త్రీలు అందరూ మరో వారం రోజుల్లోనే డెలివరీకి సిద్ధంగా ఉన్నారు. వీరంతా తమ పిల్లలు అర్జెంటినాలో పుట్టాలని ఆకాంక్షిస్తున్నారు. తమ పిల్లలకు రష్యా పౌరసత్వం కంటే.. అర్జెంటినా పౌరసత్వాన్ని కలిగి ఉండటమే మంచిదని భావిస్తున్నారు. అర్జెంటినాలో స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుందని కారణం చెబుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కాటిలో.. కడసారి !!మూగబోయిన బాలయ్య గొంతు !!

Pawan Kalyan: సేనాని కష్టం వృథా !! చనిపోయిన చిన్నారి !! పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్

ఆస్కార్‌కు అడుగు దూరంలో.. RRRకు మరో ప్రతిష్టాత్మక అవార్డు

RRR: జపాన్‌ గడ్డపై RRR దిమ్మతిరిగే హిస్టరీ.. మాములుగా ఉండదు మరి

Taraka Ratna: తమ్ముడి ఎన్టీఆర్ సాయమే తారకరత్నను నిలబెట్టింది

 

Published on: Feb 21, 2023 08:55 AM
Follow Us