కుంభమేళాలో రష్యన్‌ బాబా.. ఈయన బ్యాగ్రౌండ్ ఇదే..

Updated on: Jan 23, 2025 | 5:13 PM

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ‘మహా కుంభమేళా’ భక్తజన సందోహంతో కోలాహలంగా ఉంది. ఈ మహా కుంభమేళాకు దేశ నలుమూలల నుంచి రకరకాల బాబాలు, సాధువులు తరలివస్తున్నారు. ఈ కుంభమేళాలో చిత్ర విచిత్రమైన బాబాలు భక్తులను ఆకట్టుకుంటున్నారు. వారిని దర్శిచేందుకు భక్తులు సైతం క్యూ కడుతున్నారు. ఒకరు తలపై బార్లీ పంట సాగుచేస్తుంటే.. మరొకరేమో సంవత్సరాలుగా స్నానమే చేయలేదు.

45 కిలోల బరువున్న రకరకాల రుద్రాక్షలు ధరించిన వారు మరొకరు.. ఇలా చెప్పుకుంటే పోతే లిస్టు కాస్తపెద్దగానే ఉంటుంది. అయితే తాజాగా రష్యన్‌ బాబాగా పిలుచుకునే మరో బాబా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ బాబా కథాకమామీషు ఏంటో తెలసుకుందాం. మహాకుంభ మేళాలో రష్యాకు చెందిన ‘బాహుబలి బాబా’ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఆరడుగుల ఎత్తు, కండలు తిరిగిన దేహం, అందమైన ముఖవర్ఛస్సుతో అందరినీ ఇట్టే ఆకట్టుకుంటున్నారు. అందుకే అందరూ ఆయన్ను ‘బాహుబలి బాబా’ అని పిలుస్తున్నారు. ప్రస్తుతం ఈయన సోషల్‌ మీడియాలో పాపులర్‌ అయిపోయారు. రష్యాలో ఉపాధ్యాయుడైన ఈయన ప్రపంచంలోని చాలా దేశాల్లో టూరిస్టుగా తిరిగారు. ఈ క్రమంలోనే 30 ఏళ్ల క్రితం భారత పర్యటనకు వచ్చారు. అదే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. సనాతన ధర్మంతో ఇక్కడే ఆయనకు పరిచయం ఏర్పడింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తేనెకళ్ల సుందరికి బంపర్‌ ఆఫర్ బాలీవుడ్‌ సినిమాలో ఛాన్స్‌..

Donald Trump: ట్రంప్‌ దూకుడు.. ఆ ఉద్యోగులందరికీ లే ఆఫ్‌లు..

ఫ్రెండ్ ఫ్రెండే.. బిజినెస్ బిజినెస్సే.. ఇండియాతోనూ ట్రంప్ ట్రేడ్ వార్ ??

Hyderabad: హైదరాబాద్ లో కిడ్నీ రాకెట్ కలకలం

తెలంగాణలో రేషన్‌ కార్డు దారులకు అలర్ట్..