నడిరోడ్డుపై ఆర్టీసీ బస్సులు పోటాపోటీ.. హడలిపోయిన ప్రయాణికులు వీడియో

Updated on: Aug 16, 2025 | 8:10 PM

అతివేగం ప్రమాదకరం. వాహనానికి- వాహనానికి మధ్య 50 అడుగుల దూరం పాటించాలని వాహనాల వెనుక స్లోగన్స్‌ రాస్తారు. కానీ ఎవ్వరూ పాటించరు. ట్రాఫిక్‌ రూల్స్‌ని అతిక్రమించి వేగంగా దూసుకెళ్తూ తోటి వాహనదారులను భయాందోళనకు గురిచేస్తుంటారు. తాజాగా అలాంటి ఘటనే కరీంనగర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ఎవరో ఆకతాయిలు చేసిన పని కాదు ఇది.. బాధ్యతాయుతంగా మెలగాల్సిన ఆర్టీసీ డ్రైవర్లే విచక్షణ మరిచి ప్రవర్తించారు.

కరీంనగర్ జిల్లా జమ్మికుంట-హుజురాబాద్ ప్రధాన రహదారిపై ఆర్టీసీ డ్రైవర్లు ముగ్గురూ మూడు బస్సులతో ఒకరినొకరు ఓవర్‌ టేక్‌ చేసేందుకు పోటీపడ్డారు. ఆ దృశ్యం చూస్తే అక్కడ బస్సుల రేసింగ్‌ జరుగుతుందా అనిపించింది. ప్రమాదకరంగా బస్సులను ఓవర్‌టేక్‌ చేసేందుకు ప్రయత్నిస్తూ ఇతర వాహనదారులకు దారి ఇవ్వకుండా ఆర్టీసీ డ్రైవర్లు ప్రవర్తించిన తీరుకు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ఆర్టీసీ బస్సుల డ్రైవర్లు తమ దూకుడుతో ప్రయాణికులను హడలెత్తించారు. మూడు బస్సులు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ డ్రైవర్లు రహదారిపై రేసింగ్ జరిపిన ఘటన ప్రయాణికులను, ఇతర వాహనదారులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. హుజురాబాద్ ఆర్టీసీ డిపోకు చెందిన మూడు బస్సులు జమ్మికుంట నుండి హుజురాబాద్ వైపు వెళుతున్నాయి. ఈ క్రమంలో ముగ్గురు డ్రైవర్లు ఒకరినొకరు అధిగమించేందుకు తీవ్రంగా పోటీపడ్డారు.

మరిన్ని వీడియోల కోసం :

ఐశ్వర్యారాయ్‌ 17 ఏళ్లుగా రాఖీ కడుతున్న ఆ స్టార్‌ యాక్టర్‌ ఎవరో తెలుసా?

కాసేపట్లో పెళ్లి.. మొదటి భార్యతో వరుడు జంప్ వీడియో

సింహానికి ఎదురెళ్లిన మనిషి.. చివరికి.. వీడియో

ఆ సమయంలో మహిళలకు ఎందుకు ఎక్కువగా జుట్టు రాలిపోతుందో తెలుసా?