Round houses: మట్టితో గుండ్రంగా అపార్టమెంట్లు...!! ఎక్కడో తెలుసా...?? ( వీడియో )
Round Houses

Round houses: మట్టితో గుండ్రంగా అపార్టమెంట్లు…!! ఎక్కడో తెలుసా…?? ( వీడియో )

|

Jun 30, 2021 | 6:54 PM

ఆగ్నేయ చైనాలో ప్రాచీన కాలం నుంచే అపార్టుమెంట్లు ఉండేవి. అయితే, ఇప్పటి అపార్టుమెంట్ల తరహాలో కాకుండా గుండ్రంగా ఉంటాయి. పైగా వాటిని సిమెంట్‌తో కాదు.

ఆగ్నేయ చైనాలో ప్రాచీన కాలం నుంచే అపార్టుమెంట్లు ఉండేవి. అయితే, ఇప్పటి అపార్టుమెంట్ల తరహాలో కాకుండా గుండ్రంగా ఉంటాయి. పైగా వాటిని సిమెంట్‌తో కాదు.. మట్టి, చెక్కలతో మాత్రమే నిర్మించారు. అక్కడ అడుగు పెట్టేవారికి అదో ప్రత్యేక ప్రపంచంలో ఉన్నట్లు అనిపిస్తుంది. దాదాపు 12వ శతాబ్దంలో కట్టిన ఈ మట్టి అపార్టుమెంట్లు ఇప్పటికీ బలంగానే ఉన్నాయి. అందుకే యునెస్కో వాటిని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఇంజినీర్లనే ఆశ్చర్యానికి గురిచేస్తున్న ఈ కట్టడాలు ఫ్యూజియన్‌లో ఉన్నాయి. వీటిని ‘ఫ్యూజియన్ టులువ్’ అని పిలుస్తారు. ఇవి చలికాలంలో వెచ్చగా, వేసవిలో చల్లగా ఉంటాయి. భూకంపాలను సైతం ఇవి తట్టుకుంటాయి. చైనాకు చెందిన పలు యాక్షన్ చిత్రాల్లో ఈ అపార్టమెంట్లను చూడవచ్చు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Corona Virus: 10 నెలల్లో 43 సార్లు పాజిటివ్.. ఐదుసార్లు మృత్యు ముఖంలోకి… ( వీడియో )

Priyanka Chopra: ఫారిన్ లో ప్రియాంక చోప్రా పానీ పూరి సెంటర్… వైరల్ వీడియో