నిమిషాల్లో వజ్రాలు తయారీ.. ఎక్కడంటే ??
వజ్రం.. ఖరీదైన నవరత్నాల్లో ఒకటి. భూమ్మీద సహజంగా లభించే అత్యంత కఠినమైన పదార్థాం కూడా వజ్రమే. భూమి పొరల్లో కొన్ని లక్షల సంవత్సరాలపాటు అత్యధిక ఉష్ణోగ్రత, పీడనానికి గురై కార్బన్ అణువులు ఘనీభవించడం వల్ల ఏర్పడుతుంది. ఫ్యాషన్ మార్కెట్ లో వజ్రాలకు డిమాండ్ ఎక్కువ. దీంతో సహజ డైమండ్లను వెలికితీసి సానబెట్టేందుకు సుదీర్ఘ సమయం పడుతుండటంతో కృత్రిమంగా వజ్రాల తయారీ ఊపందుకుంటోంది.
వజ్రం.. ఖరీదైన నవరత్నాల్లో ఒకటి. భూమ్మీద సహజంగా లభించే అత్యంత కఠినమైన పదార్థాం కూడా వజ్రమే. భూమి పొరల్లో కొన్ని లక్షల సంవత్సరాలపాటు అత్యధిక ఉష్ణోగ్రత, పీడనానికి గురై కార్బన్ అణువులు ఘనీభవించడం వల్ల ఏర్పడుతుంది. ఫ్యాషన్ మార్కెట్ లో వజ్రాలకు డిమాండ్ ఎక్కువ. దీంతో సహజ డైమండ్లను వెలికితీసి సానబెట్టేందుకు సుదీర్ఘ సమయం పడుతుండటంతో కృత్రిమంగా వజ్రాల తయారీ ఊపందుకుంటోంది. అయితే దీనికి కూడా కొన్ని వారాల సమయం పడుతుంది. అందుకే, దక్షిణ కొరియాకు చెందిన పరిశోధకులు ఓ సరికొత్త పద్ధతిని అభివృద్ధి చేశారు. ప్రత్యేకమైన ద్రవ లోహ మిశ్రమంతో కేవలం 150 నిమిషాల్లోనే వజ్రాలను తయారు చేసే పద్ధతిని రూపొందించారు. అది కూడా సాధారణ వాతావరణ పీడనంతోనే వాటిని తయారు చేస్తున్నారు. ఈ కొత్త పద్ధతి ఇప్పటివరకు అవసరమవుతున్న భారీ పీడన ప్రక్రియను నివారించనుంది. పారిశ్రామిక అవసరాల కోసం వజ్రాల ఉత్పత్తిని పెంచేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని దక్షిణ కొరియాలోని ఇన్ స్టిట్యూట్ ఫర్ బేసిక్ సైన్స్ కు చెందిన పరిశోధకులు అభిప్రాయపడ్డారు. ద్రవ లోహంలో కార్బన్ అణువులను కలపడం అనేది కొత్త ప్రక్రియ కానప్పటికీ ఇప్పటివరకు ఇందుకోసం భారీ పీడనాన్ని ఉపయోగించాల్సి వచ్చేది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఉదయం అల్పాహారంగా అన్నం తినొచ్చా ?? తింటే ఏం జరుగుతుంది ??
Solar Storm: సూర్యుడిపై భారీ సౌర తుపానులు
కొత్త కాపురంలో చిచ్చు పెట్టిన జ్యూస్.. పుట్టింటికి చేరిన యువతి !!
గర్ల్ ఫ్రెండ్‌కు ఊహించని షాకిచ్చిన ప్రియుడు !! ఏం చేసాడంటే ??