Rhino: కొమ్ములో విషం.. స్మగ్లర్లకు శాపం..
వేటగాళ్ల దాడుల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఖడ్గమృగాల సంఖ్య పడిపోతోంది. అవి వేటగాళ్ల బారినపడకుండా దక్షిణాఫ్రికా పరిశోధకులు కొత్త విధానాన్ని కనిపెట్టారు. రైసోటోప్ ప్రాజెక్ట్‌లో బాగంగా వాటి కొమ్ముల్లో రేడియేషన్ ఉన్న ఐసోటోప్‌లను ఇంజెక్ట్ చేసారు. దీంతో రైనో కొమ్ముల కోసం వాటిని చంపే స్మగ్లర్లకు ఇది శాపంగా మారనుంది .
పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడటంలో రైనోలు ముఖ్య భూమిక పోషిస్తాయని, అందుకే వాటిని కాపాడుకునేందుకు ఈ దిశగా అడుగులు వేశామని పరిశోధకులు చెబుతున్నారు. ఖడ్గమృగాల కొమ్ముల కోసం వాటిని చంపడం ఎక్కువయింది. చైనా, వియత్నాం, యెమెన్‌లో వీటి కొమ్ములకు గిరాకీ ఎక్కువ. మ్యాజికల్ మెడిసిన్ పేరుతో ఆ దేశాల్లో దీని కొమ్ములో ఉండే కెరాటిన్‌ను తీసి.. కేన్సర్ నుంచి పలు రకాల చికిత్సలో వాడుతుంటారు. ఆసియాలో బంగారం కంటే ఎక్కువ ధరకు ఈ కొమ్ములు స్మగ్లర్లు అమ్ముతున్నారు. మన శంలో ఒక కొమ్ము ధర లక్ష రూపాయలు పలుకుతున్నట్లు సమాచారం. అయితే.. దీనికి చెక్ పెట్టి.. ఖడ్గమృగాలను కాపాడటంతో కోసం.. మృగం కొమ్ముల్లోకి చిన్న మోతాదులో ఐసోటోప్‌లను ఇంజెక్ట్ చేస్తారు. దానివల్ల ఆ జంతువు కొమ్ము నిరుపయోగంగా మారి.. ఔషధాల తయారీకి పనికిరాకుండా పోతుంది. అదే సమయంలో రైనోలకు మాత్రం ఏ హానీ కలగదు. అలాగే, నౌకాశ్రయాలు, విమానాశ్రయాల్లో స్కానర్లు అమర్చి..దొంగచాటుగా రవాణా అవుతున్న ఈ కొమ్ములను అధికారులు గుర్తిస్తున్నారు. అవి కంటైనర్లలో ఉన్నా సరే.. స్కానర్స్ వాటిని గుర్తించేలా ఏర్పాట్లు చేశారు. ఒకవేళ అవి మార్కెట్‌లోకి వెళ్లిపోయినా రేడియోధార్మికత వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. దీంతో అక్రమవేట కార్యకలాపాలు తగ్గనున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో అయిదు ఖడ్గ మృగం ఉప జాతులున్నాయి. నలుపు, బూడిద రంగువి ఆఫ్రికా ఖండంలో ఉన్నాయి.2020 నివేదికల ప్రకారం..మనదేశంలో గత పదేళ్లలో వందలాది ఖడ్గ మృగాలు వేటకు గురయ్యాయని , ప్రస్తుతం మూడు వేలకు పైగా భారతీయ ఖడ్గమృగాలు అడవిలో సజీవంగా ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. వీటిలో దాదాపు 2000 అస్సాంలో మాత్రమే కనిపిస్తాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇంకా పట్టాలెక్కని వందే భారత్ స్లీపర్ రైళ్లు.. ఎందుకు లేటు
నేను ఐఏఎస్‌ను.. ఇన్‌ఛార్జి కలెక్టర్‌గా వచ్చాను
ఆమె అప్పుడు హైదరాబాదీ.. ఇప్పుడు అమెరికాలో వర్జీనియా గవర్నర్
