Viral Video: ఖడ్గమృగాల కొమ్ములకు నిప్పు పెట్టారు.. ఎందుకలా చేశారో తెలిస్తే ఆశ్చర్యం! వీడియో

|

Sep 26, 2021 | 9:07 AM

ఖడ్గమృగాల కొమ్ముల్లో అద్భుత ఔషధ గుణాలను కలిగి ఉంటాయన్న అపనమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. ఇందుకు విచక్షణారహితంగా ఖడ్గమృగాలను వధిస్తున్నారు.

YouTube video player

ఖడ్గమృగాల కొమ్ముల్లో అద్భుత ఔషధ గుణాలను కలిగి ఉంటాయన్న అపనమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. ఇందుకు విచక్షణారహితంగా ఖడ్గమృగాలను వధిస్తున్నారు. ఈ అపోహను తొలగించేందుకు అస్సాం ప్రభుత్వం ఓ గొప్ప కార్యక్రమం చేపట్టింది. ఖడ్గమృగాలకు చెందిన 2,479 కొమ్ములను అగ్నికి ఆహుతి చేసింది. ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవాన్ని పురస్కరించుకొని బొకాఖాట్‌ పట్టణంలో ఈ దహన కార్యక్రమానికి ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సహా పలువురు మంత్రులు హాజరయ్యారు. ఒంటికొమ్ము ఖడ్గమృగాలకు అస్సాం ప్రసిద్ధి. రాష్ట్రంలోని కజిరంగా ఇంకా ఇతర జాతీయ పార్కుల్లో అవి 2,600 వరకూ ఉన్నట్లు అంచనా.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: మాకు మాటలు వచ్చు.. అయినా మాది మూగభాష.. అలీపూర్‌ గ్రామం విశేషాలు.. వీడియో

పేప‌రేస్తే త‌ప్పేంటి..? బుడ్డోడి కాన్ఫిడెన్స్‌కి కేటీఆర్ ఫిదా! వీడియో