ఇదో గాలి రైలు.. అంటే గాల్లో ఎగరదు.. పట్టాలపై వాయువేగంతో దూసుకెళ్తుంది !
భారతీయ రైల్వే పర్యావరణ హిత హైడ్రోజన్ రైలును ప్రవేశపెట్టబోతోంది. ఇది శబ్ద రహితంగా, కాలుష్య రహితంగా గంటకు 150 కి.మీ. వేగంతో దూసుకెళ్తుంది. వందే భారత్‌కు పోటీగా, జనవరి 2026 నాటికి జింద్-సోనీపట్ మార్గంలో ప్రారంభమయ్యే ఈ రైలు ప్రపంచంలోనే అతి పొడవైన హైడ్రోజన్ రైలు కానుంది. టికెట్ ఛార్జీలు కేవలం 5 నుంచి 25 రూపాయలుగా అంచనా.
భారతీయ రైల్వే మరో విప్లవాత్మక అడుగు వేస్తోంది. దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ రైలును త్వరలో ప్రవేశపెట్టనుంది. ఈ రైలు పూర్తిగా శబ్ద రహితంగా, పొగ లేకుండా వాయువేగంతో దూసుకెళ్తుంది. జనవరి 2026లో దీని సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ట్రయల్ రన్‌లు ఇప్పటికే పూర్తయ్యాయి.ఈ సైలెంట్ ట్రైన్ ప్రారంభంలో జింద్-సోనీపట్ మార్గంలో నడవనుంది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో దీనిని తయారు చేశారు. హైడ్రోజన్ శక్తితో నడిచే ఈ రైలు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఒకేసారి 2,600 మంది ప్రయాణించవచ్చు. ప్రపంచంలోనే అతి పొడవైన హైడ్రోజన్ రైలుగా ఇది నిలవనుంది.
మరిన్ని వీడియోల కోసం :
నిద్రలేని రాత్రులు గడిపానన్న విజయ్… మెగాస్టార్‌కి ఊరట!
సందీప్‌ని గుర్తుచేసిన గీతూ…అంతకు మించి అంటున్న ఆడియన్స్
పండగపూట భగ్గుమంటున్న చికెన్, మటన్ ధరలు
ఒక్కపాము కాటేస్తే.. మూడు పాములతో ఆస్పత్రికి..
