వీధి కుక్కలపై వింత నిర్ణయం రెండు సార్లు కరిస్తే.. జీవిత ఖైదే

Updated on: Sep 20, 2025 | 12:18 PM

రోడ్డు మీద పోయే మనుషులను వీధి కుక్కలు కరిస్తే.. వాటిని శిక్ష విధించేలా ఉత్తర్ ప్రదేశ్‌ ప్రభుత్వం విచిత్ర నిర్ణయం తీసుకుంది. అకారణంగా మనుషుల మీద పడి కరిచే వీధి కుక్కలను 10 రోజుల పాటు జంతు కేంద్రానికి తరలించాలని, అదే.. రెండో సారీ అలాగే చేస్తే.. ఆ కుక్కలు జీవిత కాలమంతా జంతు కేంద్రంలోనే గడపేలా చూడాలని నిబంధనలు రూపొందించారు.

అయితే ఆ కుక్కను దత్తత తీసుకోవడానికి అంగీకరించి, ఇక ముందు దానిని వీధిలోకి విడిచిపెట్టమంటూ ఎవరైనా అఫిడవిట్‌ ఇస్తే.. దానికి ఎలాంటి శిక్ష విధించకుండా వారికి అప్పగిస్తారు. వీధి కుక్కల ఆగడాల నివారణకు యూపీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అమృత్‌ అభిజిత్‌ అన్ని పట్టణ, గ్రామీణ పౌర సంస్థలకు ఈ సెప్టెంబర్‌ 10న ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా వ్యక్తి కుక్క కాటుకు గురై యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌ కోసం వస్తే ఆ ఘటనను నమోదు చేసుకున్న అధికారులు ఆ వ్యక్తిని కరిచిన కుక్కను గుర్తించి మొదటి తప్పుగా 10 రోజుల శిక్ష విధిస్తారు. తర్వాత దానికి మైక్రోచిప్‌ అమర్చి 10 రోజుల పాటు దాని కదలికలను నమోదు చేస్తారని ప్రయాగ్‌ రాజ్‌ వెటర్నరీ అధికారి బిజయ్‌ అమృత్‌ రాజ్‌ తెలిపారు. అదే కుక్క మరోసారి మనిషిని కరిస్తే ఇక దానికి జీవిత శిక్ష తప్పదని చెప్పారు. ఒక వేళ ఆ కుక్కను దత్తత తీసుకున్న వ్యక్తి దానిని వీధిలోకి విడిచిపెడితే ఆ వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తిరుమల డిసెంబర్‌ కోటా టిక్కెట్లు విడుదల.. ఎలా బుక్‌ చేసుకోవాలంటే

Gold Price: మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఇప్పట్లో ఆగేలా లేదుగా

కంట్లో కారం కొట్టి 6 తులాల బంగారు ఆభరణాలను లాక్కెళ్లిన మహిళ

ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి ఇచ్చే యోచనలో తెలంగాణ సర్కార్

తిరుపతి జిల్లా చియ్యవరంలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన