రూ.200 నోట్లు రద్దు..? కీలక ప్రకటన చేసిన ఆర్‌బీఐ.. వీడియో

Updated on: Jan 20, 2025 | 7:55 AM

ప్రస్తుతం రూ.2000 నోట్లను రిజర్వ్‌ బ్యాంక్‌ ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే 98 శాతం పైగా ఈ నోట్లు బ్యాంకులకు చేరగా, మిగతా నోట్లు ఇంకా మార్కెట్లో ఉన్నాయి. గతంలో పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత రూ.500, రూ.200 నోట్లను తీసుకువచ్చింది ఆర్బీఐ. అయితే ఇటీవల రూ.200 నోట్లు ఆర్బీఐ రద్దు చేస్తున్నట్లు సోషల్‌ మీడియాలో వార్తలు వైరల్‌ అవుతున్నాయి. 2 వేల రూపాయల నోట్లను ఉపసంహరించు కుంటున్నట్లుగానే ఇప్పుడు 200 నోటు విషయంలో కూడా ప్రభుత్వం ఇదే అడుగు వేయవచ్చని వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం మార్కెట్‌లో 500 మరియు 200 రూపాయల నోట్లు ఎక్కువగా చెలామణిలో ఉన్నాయి. దీనికి సంబంధించి రిజర్వ్‌ బ్యాంక్‌ కీలక ప్రకటన చేసింది. ఆర్‌బీఐ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. మార్కెట్లో నకిలీ 200 రూపాయల నోట్లు వస్తున్నాయని, నకిలీ నోట్లను అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నామని ఆర్బీఐ తెలిపింది. కొందరు 200 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు పుకార్లు సృష్టిస్తున్నారని, అలాంటిదేమి లేదని స్పష్టం చేసింది. ఇలాంటి వార్తలను ప్రజలు నమ్మవద్దని సూచించింది. 2000 రూపాయల నోట్లపై నిషేధం తర్వాత దేశంలో నకిలీ 200, 500 రూపాయల నోట్ల చెలామణి నిరంతరం పెరుగుతోందని ఆర్‌బిఐ తెలిపింది. ఇలాంటి పరిస్థితిని క్యాష్ చేసుకోవడానికి కేటుగాళ్లు రంగంలోకి దిగి నోట్లను రద్దు చేస్తున్నట్లు పుకార్లు సృష్టిస్తున్నారని ఆర్బీఐ తెలిపింది. లావాదేవీల సమయంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరించింది. ఇటీవల తెలంగాణలో 200 రూపాయల నోట్లకు కలర్ జిరాక్సులు తీయించి చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వార్తల కోసం :

పందెం అంటే ఆ మాత్రం ఉంటది.. బౌన్సర్లుగా మహిళలు..తగ్గేదే లే!

బైక్‌పై జంట రొమాన్స్‌.. అందరూ చూస్తుండగానే..

పెట్రోల్ పోయని బంక్ సిబ్బంది..కోపంతో ఈ వ్యక్తి ఏం చేశాడంటే..