Rastrapathi Bhavan: రాష్ట్రపతి భవన్ ఎంత పెద్దదో చూడండి.. లోపల ఎప్పుడైనా చూసారా..? మీ కళ్ళను మాయచేస్తుంది…
రాష్ట్రపతి భవన్‌ను ఎప్పుడైనా చూసారా.. దేశాధినేతలందరి బంగ్లాలకంటే అతి పెద్ద బంగ్లా భారత రాష్ట్రపతి అధికారిక నివాసం. రాష్ట్రపతి భవన్ ఔన్నత్యాన్ని చాటుతూ...
రాష్ట్రపతి భవన్‌ను ఎప్పుడైనా చూసారా.. దేశాధినేతలందరి బంగ్లాలకంటే అతి పెద్ద బంగ్లా భారత రాష్ట్రపతి అధికారిక నివాసం. రాష్ట్రపతి భవన్ ఔన్నత్యాన్ని చాటుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఓ ఆసక్తికర వీడియోను పోస్ట్ చేశారు. రాష్ట్రపతి భవన్ గొప్పతనాన్ని చాటుతూ సాగిన ఈ వీడియోలో… రాష్ట్రపతి భవన్‌లోని ఆయా విభాగాలు, వాటి విస్తీర్ణం.. తదితరాలను పొందుపరిచారు. భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము జూలై 25న పదవీ ప్రమాణం చేసిన నేపథ్యంలో కిషన్ రెడ్డి పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది.ప్రపంచంలోని అన్ని దేశాల అధినేతల బంగ్లాలను పరిగణనలోకి తీసుకుంటే… వాటన్నింటిలోకి అతి పెద్దదిగా రాష్ట్రపతి భవన్ నిలుస్తుందని సదరు వీడియోకు కిషన్ రెడ్డి ఓ కామెంట్‌ను జత చేశారు. ఆరున్నర నిమిషాల నిడివి కలిగిన ఈ వీడియోలో రాష్ట్రపతి భవన్‌లోని గార్డెన్ల నుంచి అందులోని వివిధ కార్యక్రమాల కోసం నిర్దేశించిన మందిరాలను ప్రస్తావించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్.. సూపర్ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..
Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..
