Andhra News: ఇంట్లోని తులసి మొక్కపై అరుదైన పాము.. 2 రోజులుగా అక్కడే
అది ఇంటి లోపల వాకిట్లో ఉన్న తులసి మొక్క. ఆ ఇంట్లోని వారు రోజూ ఆ మొక్కకి పూజ చేస్తారు. అయితే అనూహ్యంగా శనివారం రోజు ఆ తులసి మొక్కపై పాము కనిపించింది. అరుదైన వర్ణంతో ఆ పాము చాలా విభిన్నంగా ఉంది. అలాంటి పాము ఎప్పుడూ చూడలేదని గ్రామస్థులు చెబుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఆ పాము 2 రోజులుగా ఆ తులసి మొక్క నుంచి కదలడం లేదు. బాపట్ల జిల్లా ఈపురుపాలెం గ్రామంలో ఈ అరుదైన ఘటన వెలుగుచూసింది.
బాపట్ల జిల్లా ఈపురుపాలెం గ్రామంలో తులసి మొక్కపై పాము కనిపించింది. ఇంటి ఆవరణంలోని ఓ తులసి మొక్కపై రెండు రోజులుగా పాము ఉండటం గమనించిన స్ధానికులు పూజలు చేస్తున్నారు. ఆ పాము విభిన్న వర్షంతో.. చాలా చిత్రంగా ఉంది. కొందరు సెల్‌ఫోన్లలో చిత్రీకరిస్తున్నారు. శుక్ర, శనివారం కావడంతో నాగదేవత మహిమ అంటూ ప్రచారం జరిగింది. దీంతో విషయం ఆ నోట ఈ నోటా పాకడంతో పామును చూసేందుకు పెద్ద ఎత్తున జనం తరలివస్తున్నారు. ప్రస్తుతం ఆ వింత పాము వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..