బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

Updated on: Dec 05, 2025 | 12:30 PM

పళ్లతో పుట్టిన శిశువు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. నాటల్ టీత్ అని పిలిచే ఈ అరుదైన పరిస్థితి లక్షలో ఒక్కరికే వస్తుంది. ఇది తల్లిపాలు పట్టడంలో ఇబ్బందులు సృష్టిస్తుంది. జన్యుపరమైన లోపంతో వచ్చే దీనిని తొలగించాల్సి ఉంటుంది. ఏలూరులో పళ్లతో పుట్టిన పసికందుకు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. కొందరు దీనిని బ్రహ్మంగారి కాలజ్ఞానంతో ముడిపెడుతున్నారు.

ప్రపంచంలో రకరకాల వింతలు జరుగుతుంటాయి. బ్రహ్మంగారి కాజ్ఞానం గురించి ఎంతోకొంత అందరికీ తెలిసే ఉంటుంది. వందల ఏళ్ల క్రితం బ్మహ్మంగారు జరగబోయేదానిని ముందు ఊహించి కాలజ్ఞానంగా బోధించారు. ఈ క్రమంలో అనేక వింత సంఘటనలు మనం చూశాం. తాజాగా ఓ శిశువు పుడుతూనే నోటిలో పళ్లతో పుట్టింది. ఈ చిన్నారిని చూసిన వారు బ్రహ్మంగారి కాలజ్ఞానం చెప్పినట్టే జరుతుతుంది అంటున్నారు. సాధారణంగా అప్పుడే పుట్టిన బిడ్డకు నోటిలో పళ్లు ఉండవు. పుట్టిన 6 మాసాల తర్వాత పిల్లల్లో పళ్లు వస్తాయి. అప్పటిరకూ పళ్లు వారి చిగుళ్లల్లో అంతర్గతంగా దాగి ఉంటాయి. క్రమంగా అవి రూపుదిద్దుకొని శిశువుకు ఆరేళ్ళ వయసు వచ్చేసరికి కొంచెం కొంచెంగా పైకి పెరుగుతూ వస్తాయి. కానీ అరుదుగా శిశువుల్లో పుట్టిన వెంటనే ఒకటి లేదా రెండు పళ్ళు కనిపిస్తే వాటిని నాటల్ టీత్ అంటారు. ఇవి చాలా అరుదుగా కనిపిస్తాయి. లక్షమంది పిల్లల్లో ఒక్కరిలో మాత్రమే ఇలా జరిగే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు . ఈ నాటల్ టీత్ వల్ల పిల్లలు తల్లి పాలు తాగటానికి ఇబ్బంది అవుతుంది. తల్లి పాలిచ్చే సమయంలో ఆమె నొప్పిభరించాల్సి ఉంటుంది. జన్యుపరమైన లోపం కారణంగా ఇలా జరిగుతుంది కాబట్టి అది ఊడిపోయి శిశువుకు ప్రమాదకరంగా పరిణమించే అవకాశం కూడా వుంది. ఐతే తాజాగా ఇలాంటి ఘటన ఏలూరు జిల్లా నూజివీడు ప్రాంతంలో జరిగింది. దుర్గ అనే మహిళకు జన్మించిన శిశువుకు ఇలా పుట్టినవెంటనే కింద చిగురులో పన్ను కనిపించింది. పుట్టిన 6 రోజుల పసికందుకు స్థానిక దంత వైద్య నిపుణుడు సర్జరీ చేసి పాల దంతాన్ని తొలగించారు. పన్ను కోలగా ఉందని దీన్ని జాగ్రత్త గా తొలగించినట్లు వైద్యుడు చెప్పారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు?

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక్‌

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్.. కన్ను పడిందా