మంచినీళ్లకోసం రైలుదిగాడు.. కట్‌చేస్తే 22 ఏళ్లకు ఇంటికి చేరాడు

|

Apr 28, 2023 | 9:20 AM

ఉన్న ఊరిలో ఉపాధి కరువై..బ్రతుకు భారమై పని వెతుక్కుంటూ కుటుంబాన్ని వదిలి వేరే ప్రాంతానికి పయనమయ్యాడు. కనిపించిన రైలెక్కాడు. మధ్యలో నీళ్ల కోసం రైలు దిగాడు.. వచ్చేలోపే రైలు వెళ్లిపోయింది. తాను ఎక్కడున్నాడో కూడా తెలియకుండా 22 ఏళ్లు గడిచిపోయాయి.

ఉన్న ఊరిలో ఉపాధి కరువై..బ్రతుకు భారమై పని వెతుక్కుంటూ కుటుంబాన్ని వదిలి వేరే ప్రాంతానికి పయనమయ్యాడు. కనిపించిన రైలెక్కాడు. మధ్యలో నీళ్ల కోసం రైలు దిగాడు.. వచ్చేలోపే రైలు వెళ్లిపోయింది. తాను ఎక్కడున్నాడో కూడా తెలియకుండా 22 ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు విధి మళ్లీ అతనిని తన వారివద్దకు చేర్చింది. ఈ విచిత్ర సంఘటన బీహార్‌ దర్బంగాలో చోటుచేసుకుంది. దర్భంగా జిల్లా బిచ్చౌలి గ్రామానికి చెందిన రమాకాంత్‌ ఝా.. భార్య, మూడేళ్ల కుమారుడిని ఇంట్లో వదిలేసి పనికోసం హరియాణాకు పయనమయ్యాడు. అంబాలా స్టేషనులో రైలు ఆగింది. నీళ్లబాటిల్‌ కొనుక్కుందామని రైలు దిగిన రమాకాంత్‌ తిరిగి రైలు ఎక్కేలోపే అది వెళ్లిపోయింది. రమాకాంత్‌కు ఏం చేయాలో ఏమీ పాలుపోలేదు. మరో ఎక్కేందుకు అతనివద్ద డబ్బులు కూడా లేవు. అక్కడక్కడే తిరుగుతూ దిక్కులేనివాడిలా గడిపాడు.. ఆకలిదప్పులతో క్రమంగా అతడి మానసిక పరిస్థితి దిగజారింది. చెత్తకుండీల్లో దొరికిన ఆహారం తింటూ కాలం గడిపాడు. రమాకాంత్‌ ఏమయ్యాడో తెలియక కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసి, పలుచోట్ల వెదికారు. చివరికి కర్నాల్‌లోని ‘ఆషియానా’ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్‌ రాజ్‌కుమార్‌ అరోరా కంటపడ్డాడు రమాకాంత్‌. ఆయన తన ఇంటికి తీసుకెళ్లి.. అతనికి వైద్యం చేయించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

20 ఏళ్ల కింద చంపేశా.. కలలోకి వచ్చి హింసిస్తున్నాడు !!

కోడి పిల్లలతో కుక్క స్నేహం.. నెటిజన్ల ప్రశంసలు

6000 అడుగుల ఎత్తునుంచి కింద పడి.. 72 గంటలు నరకయాతన

Balagam: స్టార్ డైరెక్టర్‌ ఫిల్మ్‌లో కీ రోల్.. బంపర్ ఆఫర్ కొట్టిన బలగం పాప !!

Published on: Apr 28, 2023 09:20 AM