నా గురువు దావుద్ ఇబ్రహీం! ఆర్జీవీపై నెటిజన్లు ఫైర్ వీడియో

Updated on: Sep 07, 2025 | 9:37 PM

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వర్మ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నలుగురికీ నచ్చినది ఆయనకు నచ్చదు. బతికితే తనలా బతకాలి అంటారు. దీనికి విమర్శకులు అది కూడా ఒక బతికేనా అని అంటారు. ఎవరు ఏమి అనుకున్న వర్మ మాత్రం తాను ఎలా బతకాలి అనుకుంటారో అలాగే జీవిస్తున్నారు. ఒకప్పుడు సోషల్ మీడియాలో వర్మ చేసే పోస్టులకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. ఎవరి మీద కౌంటర్ వేస్తున్నారు, ఎవరి గురించి ఏం రాస్తున్నారో అని చాలా క్యూరియాసిటీగా నెటిజెన్స్ ఎదురు చూసేవారు. కొన్ని నెలలుగా వర్మ సైలెంట్ గా ఉంటున్నారు. కారణాలు ఏమైనా వర్మ పోస్టుల విషయం పక్కన పెడితే ప్రతి పండుగకు వర్మ విషెస్ చెప్పే విధానమే వేరు.

టీచర్స్ డే రోజున తమకు పాఠాలు నేర్పిన గురువులకు ప్రతి ఒక్కరు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. వర్మ కూడా తన జీవితంలో ఎదగడానికి సహాయపడిన గురువులకు టీచర్స్ డే శుభాకాంక్షలు తెలిపాడు. అయితే వర్మ తన ట్వీట్ లో టీచర్స్ డే నాడు తీవ్ర దుమారం రేపారు. తనకు స్ఫూర్తినిచ్చిన గురువుల జాబితాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అంతర్జాతీయ ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం పేరును చేర్చడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. శుక్రవారం సెప్టెంబర్ 5న టీచర్స్ డే సందర్భంగా రామ్ గోపాల్ వర్మ ఎక్స్ వేదికగా ఆ పోస్ట్ చేశారు. తాను దర్శకుడిగా మారడానికి తన జీవితంలో తనకు నచ్చినది చేయడానికి తనను ప్రేరేపించిన గొప్ప వ్యక్తులందరికీ ఇదే తన సెల్యూట్ అంటూ రాసి వచ్చారు. తనకు స్ఫూర్తిగా నిలిచిన అమితాబ్ బచ్చన్, స్టీవెన్ స్పిల్ బర్గ్, అయాన్ రాండ్, బ్రూస్ లీ, శ్రీదేవి, దావూద్ ఇబ్రహీం కు టీచర్స్ డే శుభాకాంక్షలు అంటూ తన పోస్ట్ లో రాశారు. ఈ పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికే నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దావూద్ ఇబ్రహీం వంటి ఉగ్రవాదిని లెజెండరీ నటులు, దర్శకులకు సమానంగా గురువుగా పేర్కొనడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రమైన ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఒక నేరస్తుడిని గురువుగా కీర్తించడం సిగ్గుచేటని వర్మ తీరు అభ్యంతరకరంగా ఉందని పలువురు కామెంట్లు పెడుతున్నారు. ఆయనను విపరీతంగా ట్రోల్ చేస్తూ తమ నిరసనను తెలుపుతున్నారు. తమదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలిచే వర్మ ఈసారి ఏకంగా దావూద్ పేరును ప్రస్తావించి మరో పెద్ద వివాదానికి తెరలేపారు.

మరిన్ని వీడియోల కోసం :

ఇరగదీసిన అమ్మాయిలు..కుర్చీ మడతబెట్టి పాటకు అదిరిపోయే స్టెప్స్ వీడియో

పండగ స్పెషల్.. అమెజాన్ Vs ఫ్లిప్‌కార్ట్‌‌లో కళ్లు చెదిరే ఆఫర్స్.. వీడియో

ఈ ఐఏఎస్‌ల పెళ్లి ఖర్చు.. కేవలం రెండు వేలే వీడియో

బ్లడ్‌ టెస్ట్‌ రిపోర్ట్‌లోని కీలకాంశాలు మీకు తెలుసా? వీడియో