భక్తి పారవశ్యం లో జనం.. శూలాల నైవేద్యం..
రాజమహేంద్రవరంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పాల్గుణ ఉత్తర పౌర్ణమి ఉత్సవం ఘనంగా జరిగింది. 49 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ తమిళ సంప్రదాయ ఉత్సవంలో, వందలాది మంది భక్తులు 10 రోజుల ఉపవాస దీక్ష అనంతరం నోటికి, శరీరానికి శూలాలను గుచ్చుకుని, కావళ్లను మోస్తూ, 700 మంది మహిళలు కలశాలతో 12 కి.మీ. పాదయాత్రలో పాల్గొన్నారు. భక్తుల అచంచలమైన భక్తి, త్యాగం నగరానికి ఆధ్యాత్మిక శోభను తెచ్చాయి.
రాజమహేంద్రవరం నగరంలో ఆథ్యాత్మిక శోభ సంతరించుకుంది. స్థానిక 9వ డివిజన్ బర్మాకాలనీలో వెలసిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పాల్గుణ ఉత్తర పౌర్ణమి ఉత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. తమిళనాడు సంప్రదాయాన్ని పుణికిపుచ్చుకున్న ఈ ఉత్సవంలో భక్తులు చూపిన అచంచలమైన భక్తి అబ్బురపరిచింది. సుమారు 10 రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలో ఉన్న వందలాది మంది భక్తులు, తెల్లవారుజామునే గోదావరి తీరంలోని పుష్కర ఘాట్‌కు చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, తమ మొక్కులు తీర్చుకోవడానికి నోటికి, శరీరానికి ఇనుప శూలాలను గుచ్చుకుని భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. కొంతమంది భక్తులు కావళ్లను, పల్లకీలను మోస్తూ స్వామివారిపై తమభక్తిని చాటుకున్నారు. సుమారు 700 మంది మహిళా భక్తులు పసుపు వస్త్రాలు ధరించి, శిరస్సున కలశాలు ధరించి 12 కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్రలో పాల్గొన్నారు. పుష్కర ఘాట్ నుండి ప్రారంభమైన ఈ శోభాయాత్ర ఎస్పీ కార్యాలయం ఎదురుగా ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వరకు అట్టహాసంగా సాగింది. గత 49 ఏళ్లుగా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారం సుబ్రహ్మణ్యేశ్వరుడిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలిరావడంతో నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kurnool: నిప్పుల కొలిమిలా కర్నూలు.. దేశంలోనే హాట్ సిటీ
Thalapathy Vijay: పాపం విజయ్… కొడుకు కూడా ఛీపో అన్నాడు!
Renu Desai: నన్ను ప్రశ్నించే హక్కు మీకు ఎవరిచ్చారు ??
భోజనం చేసిన తర్వాత కాఫీ, టీ తాగుతున్నారా ?? అయితే ఈ సమస్యలు తప్పవు బాస్
ఆ గ్రామానికీ.. ఆ పక్షులకీ మధ్య.. శతాబ్దాలుగా విడదీయరాని బంధం
