మహా కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు రద్దు? రైల్వే శాఖ క్లారిటీ! వీడియో

Updated on: Jan 30, 2025 | 1:36 PM

మహా కుంభమేళా జరుగుతున్న నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్‌కు జన ప్రవాహం పోటెత్తింది. ఎటుచూసినా జనమే జనం. ఇసుకేస్తే రాలనంతగా భక్తులు పోటెత్తుతున్నారు. వేలు, లక్షలు కాదు.. ఏకంగా కోట్లాదిగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం మౌని అమావాస్య కావడంతో జనం పుణ్యస్నానమాచరించేందుకు ఘాట్‌ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ సంఘటనతో రైల్వే శాఖ కుంభమేళాకు రైళ్లు రద్దు చేసిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి తొక్కిసలాట నేపథ్యంలో రైల్వే శాఖ ట్రైన్స్ తగ్గించిందా? రద్దు చేసిందా? దీనికి సంబంధించి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తొక్కిసలాట నేపథ్యంలో మహా కుంభమేళా స్పెషల్‌ ట్రైన్స్ రద్దు చేశారంటూ వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని పేర్కొంది రైల్వేశాఖ. కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు రద్దు చేయలేదని.. చేయబోమని ప్రకటించింది. ప్రయాగ్‌రాజ్‌ స్టేషన్‌ నుంచి 360 రైళ్లను నడుపుతున్ననట్లు వెల్లడించింది. కాగా, తొక్కిసలాట నేపథ్యంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో మాట్లాడారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. వీలైనన్ని ఎక్కువ రైళ్లు నడపాలని కేంద్ర మంత్రిని యోగి కోరారు. ప్రయాగ్‌రాజ్ నుంచి ప్రతి 4 నిమిషాలకో ట్రైన్ నడుపుతున్నట్లు రైల్వేశాఖ ప్రకటనలో తెలిపింది. అలాగే రద్దీని నియంత్రించేందుకు మహా కుంభమేళాకు దక్షిణ మధ్య రైల్వే మరిన్ని స్పెషల్ ట్రైన్స్‌ను పట్టాలెక్కిస్తోంది.