Anant -Radhika: అంబానీ కోడలంటే ఆమాత్రం ఉంటుందిమరి.. ఏకంగా బంగారంతో..!

రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ, నీతా దంపతుల చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ-రాధిక మర్చంట్‌ ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అంగరంగ వైభవంగా జరిగాయి. ఆ వేడుక ఏర్పాట్లు ప్రపంచ దేశాలనే ఆకర్షించాయి. ఎక్కడ చూసినా.. అంబానీల కుటుంబ సభ్యులు ధరించిన నగలు, ఫ్యాషన్‌ బ్రాండ్‌ డ్రస్‌లపైన తెగ చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఈ వేడుకలకు బాలీవుడ్‌ అగ్ర తారలు, ప్రముఖ పాప్‌ సింగర్‌లు తరలి వచ్చి మరీ ఆడి పాడి సందడి చేశారు.

Anant -Radhika: అంబానీ కోడలంటే ఆమాత్రం ఉంటుందిమరి.. ఏకంగా బంగారంతో..!

|

Updated on: Mar 12, 2024 | 4:52 PM

రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ, నీతా దంపతుల చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ-రాధిక మర్చంట్‌ ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అంగరంగ వైభవంగా జరిగాయి. ఆ వేడుక ఏర్పాట్లు ప్రపంచ దేశాలనే ఆకర్షించాయి. ఎక్కడ చూసినా.. అంబానీల కుటుంబ సభ్యులు ధరించిన నగలు, ఫ్యాషన్‌ బ్రాండ్‌ డ్రస్‌లపైన తెగ చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఈ వేడుకలకు బాలీవుడ్‌ అగ్ర తారలు, ప్రముఖ పాప్‌ సింగర్‌లు తరలి వచ్చి మరీ ఆడి పాడి సందడి చేశారు. దేశ విదేశాలకు చెందిన అతిరథ మహారథులంతా ఈ వేడుకకు పెద్ద ఎత్తున హాజరవ్వడమే గాక భారతీయ సంస్కృతిని ఆకళింపు చేసుకునేలా వస్త్రధారణతో అలరించారు. అయితే ఈ వేడుకలో నీతా అంబానీ, మొదటి కోడలు.. శ్లోకా మెహతా, కూతురు ఈషా అంబానీ ధరించిన లగ్జరీయస్‌ నగలు, చీరలు గురించి కథకథలుగా విన్నాం. అవన్నీ ఒక ఎత్తైతే నీతా అంబానీకి కాబోయే కోడలు రాధికా మర్చంట్‌ ధరించిన డ్రస్‌లు మరింత చర్చనీయాంశంగా మారాయి. కాబోయే పెళ్లి కూతురు, అందులోనూ ముఖేశ్‌ అంబానీ రేంజ్‌కి తగ్గట్టు ఆమె డ్రస్‌లు నగలు చాలా గ్రాండ్‌గా ఉంటాయి. అది కామనే. కానీ ఇలా ప్రీ వెడ్డింగ్‌ వేడుకల కోసమే రాధిక మరీ ఈ రేంజ్‌లో డ్రస్‌లు డిజైన్‌ చేయించుకోవడమే నెట్టింట చర్చనీయాంశమయ్యింది. ఈ ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో చివరి రోజున రాధిక ధరించిన లెహంగాని ఏకంగా బంగారపు దారాలతో రూపొందించారట. అలాగే డ్రస్‌పై ధరించే దుపట్టాను తయారు చేసేందుకు ఏకంగా ఆరు నెలల సమయం పట్టిందట. దీన్ని ప్రముఖ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా రూపొందించారట. దీనిపై నెటిజన్లు అంబానీ కోడలంటే ఆ మాత్రం ఉంటుంది మరి అంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Follow us
మీరు ఇప్పుడే ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయాలా?
మీరు ఇప్పుడే ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయాలా?
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
రుద్రాణి ప్లాన్ సక్సెస్.. అప్పూ, కళ్యాణ్‌లు జైలుకు.. పాపం అనామిక!
రుద్రాణి ప్లాన్ సక్సెస్.. అప్పూ, కళ్యాణ్‌లు జైలుకు.. పాపం అనామిక!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
చేదు రోజులు గుర్తుచేసుకున్న బిగ్‏బాస్ కీర్తి..
చేదు రోజులు గుర్తుచేసుకున్న బిగ్‏బాస్ కీర్తి..
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
రాజస్థాన్ దండయాత్రను లక్నో అడ్డుకునేనా.. రికార్డులు ఎలా ఉన్నాయంటే
రాజస్థాన్ దండయాత్రను లక్నో అడ్డుకునేనా.. రికార్డులు ఎలా ఉన్నాయంటే
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
నాగమణి చెంత ఉంటే అతీత శక్తులు వస్తాయా..? నిజం ఇదే...
నాగమణి చెంత ఉంటే అతీత శక్తులు వస్తాయా..? నిజం ఇదే...
వయసు ఒక నెంబర్ మాత్రమే.. 60 ఏళ్ల వయసులో అందాల సుందరి కిరీటం
వయసు ఒక నెంబర్ మాత్రమే.. 60 ఏళ్ల వయసులో అందాల సుందరి కిరీటం