10వ అంతస్తు నుంచి విరిగి పడ్డ లిఫ్ట్..10 సెకన్లలో ఆ చిన్నారులు..

Updated on: Aug 08, 2023 | 9:28 PM

ఓ సొసైటీలో ఇద్దరు పిల్లలు బయటకు రాగానే 10వ అంతస్తు నుంచి లిఫ్ట్ కింద పడింది. జూలై 27న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ క్లిప్ చూసిన నెటిజన్లు సైతం భయంతో వణికిపోతున్నారు. ఈ షాకింగ్‌ ఘటన మహారాష్ట్రలోని పూణెలో చోటు చేసుకుంది. ఓ సొసైటీకి చెందిన భవనంలోని లిఫ్ట్‌లో పిల్లలు వెళ్తున్నారు.

ఓ సొసైటీలో ఇద్దరు పిల్లలు బయటకు రాగానే 10వ అంతస్తు నుంచి లిఫ్ట్ కింద పడింది. జూలై 27న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ క్లిప్ చూసిన నెటిజన్లు సైతం భయంతో వణికిపోతున్నారు. ఈ షాకింగ్‌ ఘటన మహారాష్ట్రలోని పూణెలో చోటు చేసుకుంది. ఓ సొసైటీకి చెందిన భవనంలోని లిఫ్ట్‌లో పిల్లలు వెళ్తున్నారు. వారంతా లిఫ్ట్ నుండి బయటకు రాగానే, కొన్ని సెకన్ల వ్యవధిలోనే లిఫ్ట్ కింద పడిపోయింది. ఈ ఘటన మొత్తం అక్కడి సీసీటీవీలో రికార్డైంది. సీసీ పుటేజీ ప్రకారం పూణెలోని భవధాన్‌ ప్రాంతానికి చెందిన ఓ సొసైటీ భవనంలో ఒక పిల్లవాడు లిఫ్ట్‌లో నిలబడి ఉన్నట్లు కనిపించింది. పక్కనే నిలబడి స్నేహితుడితో మాట్లాడుతున్నాడు. క్షణాల్లోనే లిఫ్ట్ డోర్ తెరుచుకుంది. ఇద్దరూ బయటికి వచ్చారు. దీని తరువాత లిఫ్ట్ తలుపులు మూసుకుపోయాయి. అంతలో పెద్దగా భయంకరమైన శబ్దం వచ్చింది. అంతే కాదు లిఫ్ట్‌లో వైబ్రేషన్ కూడా కనిపిస్తుంది. లిఫ్ట్ కింద పడిపోతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రీల్స్ కోసం ఇంత రిస్క్‌ అవసరమా బాస్‌.. ఏం చేశాడంటే ??

మూడు రోజులకే ఉద్యోగం మానేసిన మహిళ.. కారణం తెలిసి నోరెళ్లబెడుతున్న నెటిజన్లు

ఎగ్జైట్‌మెంట్‌ కోసం రోలర్‌కోస్టర్ ఎక్కితే సరదా తీరిపోయింది !!

లంబోర్గినీ నా సొంతం .. పెద్దాయన ఎక్స్‌ప్రెషన్‌కు నెటిజన్లు ఫిదా

జోకర్‌ వేషంలో రైల్లో ప్రయాణికుల్ని కాల్చి చంపాడు.. చివరికి ??

 

Published on: Aug 08, 2023 09:28 PM
Loading...
Unable to load recommendations.
Follow Us