ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థిగా ప్రీషా

|

Jan 18, 2024 | 7:26 PM

అమెరికాలో తొమ్మిదేళ్ల భారతీయ అమెరికన్‌ విద్యార్థిని ప్రీషా చక్రవర్తి ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థినిగా రికార్డు పుస్తకాల్లోకెక్కింది. 90 దేశాలకు చెందిన 16 వేలమంది విద్యార్థులను ఓడించి ప్రీషా ఈ ఘనత సాధించింది. ప్రతిష్ఠాత్మక జాన్స్ హాప్‌కిన్స్ సెంటర్ ఫర్ టాలెంటెడ్ యూత్ ఈ మేరకు జాబితాను విడుదల చేసింది. కాలిఫోర్నియా ఫ్రిమోంట్‌లోని వార్మ్‌స్ప్రింగ్ ఎలిమెంటరీ స్కూల్‌ విద్యార్థిని అయిన ప్రీషా జేహెచ్-సీటీవై నిర్వహించిన సమ్మర్ 2023 గ్రేట్ 3 టెస్టులో ఈ రికార్డు అందుకుంది.

అమెరికాలో తొమ్మిదేళ్ల భారతీయ అమెరికన్‌ విద్యార్థిని ప్రీషా చక్రవర్తి ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థినిగా రికార్డు పుస్తకాల్లోకెక్కింది. 90 దేశాలకు చెందిన 16 వేలమంది విద్యార్థులను ఓడించి ప్రీషా ఈ ఘనత సాధించింది. ప్రతిష్ఠాత్మక జాన్స్ హాప్‌కిన్స్ సెంటర్ ఫర్ టాలెంటెడ్ యూత్ ఈ మేరకు జాబితాను విడుదల చేసింది. కాలిఫోర్నియా ఫ్రిమోంట్‌లోని వార్మ్‌స్ప్రింగ్ ఎలిమెంటరీ స్కూల్‌ విద్యార్థిని అయిన ప్రీషా జేహెచ్-సీటీవై నిర్వహించిన సమ్మర్ 2023 గ్రేట్ 3 టెస్టులో ఈ రికార్డు అందుకుంది. స్కూల్ అసెస్‌మెంట్ టెస్ట్, అమెరికన్ కాలేజ్ టెస్టింగ్ , స్కూల్ అండ్ కాలేజీ ఎబిలిటీ టెస్ట్‌లలో ప్రీషా అత్యద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. వెర్బల్, క్వాంటిటేటివ్ విభాగాల్లో ప్రీషా అడ్వాన్స్ గ్రేడ్5 ప్రదర్శనల్లో 99వ పర్సంటైల్‌తో సమానంగా గ్రాండ్ ఆనర్స్‌ను సొంతం చేసుకుంది. గణితం, కంప్యూటర్ ప్రోగ్రామింగ్, రసాయన, భౌతికశాస్త్రం, రీడింగ్, రైటింగ్ వంటి వాటిలో 2-12 గ్రేడ్‌లలో ఉన్న అడ్వాన్స్‌డ్ విద్యార్థుల కోసం 250కిపైగా ఉన్న జాన్స్ హాప్‌కిన్స్ సీటీవీ ఆన్‌లైన్, ఆన్ క్యాంపస్ ప్రోగ్రాంలకు ప్రీషా అర్హత సాధించింది. అలాగే, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మెన్సా ఫౌండేషన్‌లో జీవితకాల సభ్యురాలు కూడా.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Simhachalam: సింహాచల అప్పన్న ఆలయ వేడుకలో అరుదైన ఘటన..

అయోధ్య రాముడికి సికింద్రాబాద్ నుంచి భారీ లడ్డూ

అవును.. ఆ హీరోయిన్‌తో సంబంధం ఉంది.. బాంబు పేల్చిన స్టార్ డైరెక్టర్

బుడ్డోడే కానీ.. బండోడే కానీ.. బాబును చూస్తే రచ్చ చేయాల్సిందే

HanuMan: ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. బాహుబలి, సలార్ రికార్డు బద్దలుకొట్టిన హనుమాన్