అయితే షగుణ్ శర్మ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడం వల్ల అతడిని మేరఠ్ మెడికల్ కాలేజీకి తరలించాలని వైద్యులు సూచించారు. వైద్యుల సూచన మేరకు షగుణ్ శర్మ కుటుంబసభ్యులు అతడిని మేరఠ్ మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడ వైద్యులు షగుణ్‌కు చికిత్స అందించారు. ఆ తర్వాత షగుణ్ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం పరీక్షల కోసం షగుణ్ మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. పంచనామా చేసే వైద్యుడు ఒక్కసారి షగుణ్‌ను పరీక్షించారు. అప్పుడు షగుణ్ ఊపిరి పీల్చుకుంటున్నట్లు ఆయన గుర్తించారు. అప్పుడు షగుణ్ కదలడమే కాదు తాను బతికే ఉన్నానని వైద్యుడితో చెప్పాడు. దీంతో ఒక్కసారి షాక్ అయిన వైద్యుడు, షగుణ్ బతికే ఉన్నాడని మెడికల్ కాలేజీ ఉన్నతాధికారులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అలాగే షగుణ్‌ను ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. షగుణ్ బతికే ఉన్నాడని తెలియడంతో ఆయన కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటన మేరఠ్ మెడికల్ కాలేజీలో కలకలం సృష్టించింది. ప్రాణాలతో ఉన్న వ్యక్తిని చనిపోయాడని నిర్ధారించిన వైద్యుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో విచారణకు ఆదేశించారు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ఆర్‌సీ గుప్తా. నిర్లక్ష్యానికి పాల్పడినవారిపై తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరోవైపు, ఈ ఘటనపై సరూప్పుర్ పోలీసుల సైతం కేసు నమోదు చేసుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Devara OTT: ఓటీటీలోకి ‘దేవర’ ఇట్స్ అఫీషియల్ నౌ
అన్ స్టాపబుల్ షోలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న సూర్య, బాలకృష్ణ
సల్మాన్‌ను చంపేస్తాం.. మా గ్యాంగ్ యాక్టివ్‌గానే ఉంది
చందమామపై ఎలా ఉంటుందో.. మన లద్ధాఖ్‌లో అలాగే ఉంటుందా ??
1930 ఈ నెంబర్ సేవ్ చేసుకుంటే చాలు.. మీ అకౌంట్లో డబ్బులు సేఫ్ !!