రైల్వే స్టేషన్‌లో ఓ వృద్దుడిపై పోలీస్ విరుచుకుపడ్డాడు. కిండపడేసి కాళ్లతో తన్నాడు. వద్దు సార్ ప్లీజ్ అని బతిమాలుతున్నా పట్టించుకోకుండా పదే పదే కాలి బూట్లకు పనిచెప్పాడు. అక్కడితో ఆగకుండా ప్లాట్‌ఫారమ్‌పై తలకిందులుగా వేలాడదీశాడు. పోలీసా మజాకా అంటూ కిండపడేస్తానని బెదిరించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీస్ నాన్‌స్టాప్‌గా వృద్దుడిని తన్నుతూనే ఉన్నాడు. కానీ అక్కడున్న ప్యాసింజర్లెవరూ అడ్డుకోలేదు. పైగా పోలీస్ తన్నుతుంటే సినిమాలా చూశారు. ఏ ఒక్కరూ పోలీసును అడ్డుకునే సాహసం చేయలేదు. వృద్దుడ్ని కాపాడే ప్రయత్నం చేయలేదు. సీనియర్ సిటిజన్లను గౌరవించాలని పోలీస్ ఉన్నతాధికారులు పదేపదే చెబుతుంటారు. కానీ కింది స్థాయి సిబ్బంది మాత్రం శాడిస్ట్‌లు వ్యవహరిస్తూనే ఉన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్.. సూపర్ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..
Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..