24 గంటలకు కాదు.. అక్కడ 64 రోజులకు సూర్యోదయం
అలస్కాలోని ఉట్కియాగ్‌విక్ నగరం ప్రతి ఏటా 64 రోజుల పాటు నిరంతర చీకటిలో (పోలార్ నైట్) ఉంటుంది. భూమి అక్షం వంపు, ఆర్కిటిక్ సర్కిల్‌లో దీని స్థానం కారణంగా ఇది జరుగుతుంది. సివిల్ ట్విలైట్, అరోరా బోరియాలిస్ కొంత వెలుగునిస్తాయి. ఈ సమయంలో తీవ్రమైన చలి, పోలార్ వోర్టెక్స్ ప్రభావం ఉంటాయి. అయితే వేసవిలో 84 రోజులు నిరంతర పగటి వెలుగును కూడా ఈ నగరం చూస్తుంది.
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 64 రోజులు.. చుట్టూ దట్టమైన చీకటి.. గడ్డకట్టే మైనస్ ఉష్ణోగ్రతల్లో ఓ నగరం జీవించడానికి రెడీ అయిపోయింది. అలాంటి వాతావరణం ఊహించడానికే భయంకరంగా ఉంటుంది. కానీ ఆ వాతావరణాన్ని ఒక నగరం సగర్వంగా స్వాగతిస్తోంది. అమెరికాకు ఉత్తరాన ఉన్న అలస్కాలోని చిన్న పట్టణం ఉట్కియాగ్‌విక్ నవంబర్ 19న ఈ ఏడాది తన చివరి సూర్యాస్తమయాన్ని చూసింది. మళ్లీ 64 రోజుల తర్వాతే అంటే 2026 జనవరి 22న ఇక్కడి ప్రజలు తిరిగి సూర్యోదయం చూస్తారు. రెండు నెలలకు పైగా ఇక్కడి ప్రజలు చీకటిలోనే జీవిస్తారు. భూమి అక్షం వంపు ఆర్కిటిక్ సర్కిల్ స్థానంపై ఉట్కియాగ్‌విక్ ఉండటంతో ఇంతటి సుదీర్ఘమైన చీకటికి కారణమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ధ్రువ ప్రాంతాలలో ఏడాదిలో కొన్ని నెలలు సూర్యుడు హోరిజోన్ కిందే ఉండిపోతాడు.నిజానికి, 64 రోజుల పాటు అంతులేని చీకటి అంటే భయమేస్తుంది. కానీ ఈ ప్రాంతం పూర్తిగా అంధకారంలో మునిగిపోదు. సూర్యుడు అస్తమించిన తర్వాత లేదా ఉదయానికి ముందు కనిపించే లేత నీలిరంగు కాంతి కొన్ని గంటల పాటు ఉట్కియాగ్‌విక్‌ను వెలిగిస్తుంది. దీనిని సివిల్ ట్వైలైట్ అంటారు. ఈ కాంతి వల్లే స్థానికులు తమ దైనందిన కార్యకలాపాలను పూర్తి చేయగలుగుతారు. దీనికి తోడు నార్తర్న్ లైట్స్ అని పిలువబడే అరోరా బోరియాలిస్ కూడా ఈ చీకటి రాత్రులలో అద్భుతమైన వెలుగును అందిస్తాయి. సూర్యరశ్మి లేకపోవడం కారణంగా పగటిపూట ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయి.ఈ సుదీర్ఘ చీకటి కాలంలో పోలార్ వోర్టెక్స్ అనే భారీ అల్పపీడనం ఏర్పడుతుంది. దీని కారణంగా అత్యంత శీతల గాలులు వీస్తాయి. ఈ పోలార్ వోర్టెక్స్ ఒక్కోసారి దక్షిణ దిశగా కదులుతుండటం వల్ల అమెరికాలోని ఇతర రాష్ట్రాలపై కూడా చలి తీవ్రత పెరుగుతుంది. ఉట్కియాగ్‌విక్‌లో శీతాకాలంలో 64 రోజులు చీకటి ఉంటే, వేసవిలో పరిస్థితి పూర్తిగా తిరగబడుతుంది. ఇక్కడ దాదాపు మూడు నెలల పాటు.. అంటే సుమారు 84 రోజులు నిరంతరాయంగా పగటి వెలుతురు ఉంటుంది. ఇక్కడ దాదాపు 4 వేల 400 మంది జనాభా నివసిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ ఆకులను చీప్‌గా చూడొద్దు.. ఆ వ్యాధికి దివ్య ఔషధం..
జారిన మహిళ దవడ.. పానీ పూరి కోసం నోరు బార్లా తెరవడంతో
ఏలియన్స్‌కు టెంపుల్ గ్రహాంతరవాసికి ఘనంగా పూజలు