Modi Workouts video: జిమ్‌లో మోదీ వర్కౌట్స్.. ఎంతసేపు చేసారు ఆంటే..? వైరల్ అవుతున్న వీడియో..
PM Modi in Gym: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో మేజర్ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం శంకుస్థాపన చేశారు. “ఫిట్ ఇండియా” అనే సందేశాన్ని దేశవ్యాప్తంగా వ్యాపింపజేస్తూ స్పోర్ట్స్ యూనివర్సిటీ శంకుస్థాపన చేసిన తర్వాత ప్రధాన మంత్రి మోడీ జిమ్‌కి వెళ్లారు.
PM Modi in Gym: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో మేజర్ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం శంకుస్థాపన చేశారు. “ఫిట్ ఇండియా” అనే సందేశాన్ని దేశవ్యాప్తంగా వ్యాపింపజేస్తూ స్పోర్ట్స్ యూనివర్సిటీ శంకుస్థాపన చేసిన తర్వాత ప్రధాన మంత్రి మోడీ జిమ్‌కి వెళ్లారు. ప్రధాని మోడీ జిమ్‌లో ఎక్సర్ సైజ్ చేస్తోన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మేజర్ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీ శంకుస్థాపనకు వెళ్లిన మోడీ అక్కడి కాంప్లెక్స్‌లో ఉన్న జిమ్‌ను సందర్శించారు. అంతేకాదు ప్రధాని మోడీ కొంచెం సేపు జిమ్‌లో ఎక్సర్‌సైజ్ చేశారు. బాడీవెయిట్ లాట్‌పుల్ మెషిన్‌తో ఎక్సర్‌సైజ్ చేశారు. దాదాపు 15 సార్లు ఆ మెషిన్‌ను కిందికి పైకి చేస్తూ ఎక్సర్‌సైజ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో షికారు చేస్తోంది.అయితే ప్రధాని మోడీ ఫిట్ నెస్ కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారనన్న సంగతి తెలిసిందే. ఆయన రోజూ ఉదయం వ్యాయామం, యోగా ను చేస్తారు. అంతేకాదు దేశ ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఇది పాటించండి అంటూ మోడీ ఓ మంత్రం కూడా ఇచ్చారు. “ఫిట్ నెస్ డోస్, రోజూ అరగంట” అనే మంత్రం. ప్రజల ఆరోగ్యం, ఆనందం ఈ మంత్రంలో దాగి ఉందని చెప్పిన సంగతి తెలిసిందే.
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!
పొలంలో బంగారు నిధులు.. కౌలుకు తీసుకునేందుకు రైతుల పోటీ
బెల్ట్ షాపులకు షాక్ ట్రీట్మెంట్.. మద్యం అమ్మితే కరెంట్ కట్!
కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!
కూలీని వరించిన అదృష్టం.. గనిలో దొరికిన రూ.40 లక్షల విలువైన వజ్రం
స్టోర్ రూంలో వింత శబ్దాలు వెళ్లి చూసిన ఇంటి యజమాని గుండె గుభేల్!
గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు

