మీసం, గడ్డం పెంచారని 80 మందిని ఉద్యోగం నుంచి తీసేశారు
హిమాచల్‌ప్రదేశ్‌లోని సోలన్ జిల్లాలో ఓ కంపెనీ యాజమాన్యం వింత కారణంతో కార్మికులను ఉద్యోగం నుంచి తీసేసింది. కార్మికుల దినోత్సవమైన మే 1న ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పర్వానూ పారిశ్రామిక ప్రాంతంలో ఓ కంపెనీ కొన్నాళ్ల క్రితం మీసం, గడ్డం పెంచారని 80 మంది కార్మికులను ఉద్యోగం నుంచి తీసేసింది. దీంతో చేసేదేం లేక కార్మికులు కంపెనీ వద్ద సమ్మె బాట పట్టారు. కంపెనీ యాజమాన్యం కార్మికులతో చర్చలు జరిపింది.
హిమాచల్‌ప్రదేశ్‌లోని సోలన్ జిల్లాలో ఓ కంపెనీ యాజమాన్యం వింత కారణంతో కార్మికులను ఉద్యోగం నుంచి తీసేసింది. కార్మికుల దినోత్సవమైన మే 1న ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పర్వానూ పారిశ్రామిక ప్రాంతంలో ఓ కంపెనీ కొన్నాళ్ల క్రితం మీసం, గడ్డం పెంచారని 80 మంది కార్మికులను ఉద్యోగం నుంచి తీసేసింది. దీంతో చేసేదేం లేక కార్మికులు కంపెనీ వద్ద సమ్మె బాట పట్టారు. కంపెనీ యాజమాన్యం కార్మికులతో చర్చలు జరిపింది. గడ్డం, మీసం తీసేస్తేనే విధుల్లోకి తీసుకుంటామని షరతు పెట్టింది. అందుకు కార్మికులు అంగీకరించలేదు. తర్వాత యాజమాన్యం షరతుకు అంగీకరించి గడ్డం, మీసం తీసేశారు. అయినా సిబ్బందిని కంపెనీ విధుల్లోకి తీసుకోలేదు. దాంతో కార్మికులు హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు, పర్వానూ లేబర్ కమిషనర్, సోలన్ జిల్లా కలెక్టర్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బరువు తగ్గాలంటే మ్యూజ్లీనా.. ఓట్సా ?? ఏది బెస్ట్ ??
రూ. 23 లక్షల వజ్రాల చెవి కమ్మలు.. 2,300కే కొనే ఛాన్సొస్తే
కదులుతున్న రైలులో భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పి పరారైన భర్త
జూపిటర్ ఉపగ్రహంపై భారీ టవర్.. గుర్తించిన నాసా జునో స్పేస్ క్రాఫ్ట్