అప్పుడే పెట్రోలు కొట్టించి బైక్‌ స్టార్ట్‌చేసుకొని వెళ్లాడు.. అంతలోనే..

Updated on: Feb 14, 2026 | 9:10 AM

ఖమ్మం బైపాస్ రోడ్‌లోని HP పెట్రోల్ బంకులో ఓ యువకుడి బుల్లెట్ బైక్ అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పూర్తి ట్యాంక్ పెట్రోల్‌తో మంటలు వ్యాపించినప్పటికీ, అప్రమత్తమైన యువకుడు వెంటనే దూకి ప్రాణాపాయం నుండి తప్పించుకున్నాడు. బంక్ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చి ప్రమాదాన్ని నివారించారు. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.

ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అప్పటి వరకూ అంతా బాగానే ఉంది అనుకున్న మరుక్షణంలో ఊహించని పరిణామాలు జరుగుతాయి. ఒక్కోసారి సిట్యుయేషన్‌ ప్రాణాలమీదకు రావచ్చు..ఒక్కోసారి ప్రాణమే పోవచ్చు. తాజాగా ఓ యువకుడు పెను ప్రమాదం నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయట పడ్డాడు. ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్ లో HP పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకొని బయటికి వెళ్తున్న ఓ యువకుడి బుల్లెట్ నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఊహించని ఈ పరిణామానికి యువకుడు షాక్‌కి గురై బండి కింద పడి వేసి వెంటనే పక్కకు దూకేసాడు. ఇంతలో మంటలు మరింత పెరిగాయి. బంకులో ఉన్న సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. అయితే బండిలో పెట్రోలు ఫుల్‌ ట్యాంక్‌కొట్టించడంతో మంటలు అదుపులోనికి రాలేదు. బండి అక్కడే ఉంటే ప్రమాదమని గ్రహించి సిబ్బంది ఆ బండిని జాగ్రత్తగా బైపాస్ రోడ్డు మీదికి తరలించి మంటలు ఆర్పి వేశారు. ఈ ఘటన ఇతర వాహనదారులను షాక్ కు గురి చేసింది. బుల్లెట్ స్టార్ట్ చేసిన కొద్ది సేపటికే భారీగా మంటలతో దగ్దం అయ్యింది. బుల్లెట్ పై యువకుడు తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నాడు. ఎటువంటి గాయాలు కాలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే దబిడి దిబిడే.. ఇంకా జాగ్రత్త బాస్

OTT ట్రెండింగ్‌లో ఎప్‌స్టీన్ వెబ్ సిరీస్‌.. రసవత్తరంగా సాగే కథ

IRCTC: రైలు ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక మీకు కావాల్సింది సీట్ వద్దకే

భార్య సీక్రెట్ లైఫ్‌ను బయటపెట్టిన ఆధార్‌ ఓటీపీ

The Raja Saab: రాజాసాబ్‌కు కొత్త తలనొప్పి.. ఓటీటీలో బయటపడిన నిజాలు

Sravanthi Chokarapu: బన్నీపై యాంకర్ స్రవంతి కామెంట్స్

Loading...
Unable to load recommendations.
Follow Us