డబ్బులు డ్రా చేసుకోడానికి వెళ్తే హెయిర్‌కట్! వైరల్ అవుతున్న ‘సెలూన్ ఏటీఎం’ కథ

Updated on: May 16, 2026 | 12:55 PM

బీహార్‌లోని దానాపూర్‌లో పాత ఎస్‌బీఐ ఏటీఎం స్థానంలో సెలూన్ ప్రారంభించడంతో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బయట ఇప్పటికీ ఎస్‌బీఐ బోర్డు అలాగే ఉండటంతో డబ్బులు డ్రా చేసుకోవడానికి వచ్చిన వారు లోపల హెయిర్‌కటింగ్ జరుగుతుండటం చూసి షాక్ అవుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు స్పందించి ఏటీఎం గుర్తులను తొలగించారు.

సాధారణంగా ఏటీఎంకి ఎందుకు వెళ్తాం..డబ్బులు డ్రా చేసుకోడానికి వెళ్తాం. తీరా అక్కడికి వెళ్లాక మీకు ఊహించని సీన్‌ ఎదురైతే.. అవును ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకోడానికి వెళ్లిన కొందరికి లోపల షేవింగ్‌లు, హెయిర్‌ కటింగ్‌లు చేస్తూ కనిపించాడు ఓ వ్యక్తి. అది చూసి లోపలికి వెళ్లినవారు షాక్‌ అవుతున్నారు. ఇదేంటి కొత్తగా హెయిర్‌ కటింగ్‌ ఏటీఎంలు కూడా వచ్చాయా అనుకుంటూ ఆశ్చర్యపోయారు. అలాంటిదేమీ లేదండి… సెలూన్‌ గతంలో ఎస్‌బీఐకి చెందిన ఏటీఎం. మరి సెలూన్‌లా ఎలా మారింది అనేగా మీ సందేహం.. ఇవిగో డీటెయిల్స్‌.. బీహార్‌లోని దానాపూర్‌లో ఈ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. దానాపూర్‌లోని రూపస్‌పూర్ ప్రాంతంలో కియోస్క్ వద్ద కొన్నేళ్ల పాటు ఎస్బీఐ ఏటీఎం పనిచేసేది. కొన్ని నెలల క్రితం బ్యాంకు ఆ ఏటీఎంను అక్కడి నుంచి తొలగించింది. అయితే, ఏటీఎం ఖాళీ అయినా బయట ఉన్న ఎస్బీఐ బోర్డు, లోగో వంటి గుర్తులను మాత్రం వారు అలాగే వదిలేశారు. ఆ తర్వాత ఆ ఖాళీ స్థలాన్ని ఓ సెలూన్ యజమాని అద్దెకు తీసుకున్నారు. అతను కూడా ఆ బోర్డును తొలగించలేదు. దాంతో బయట ఏటీఎం బోర్డు ఉండటంతో అది ఏటీఎం అనుకొని డబ్బులు డ్రా చేసుకోడానికి చాలామంది లోపలికి వెళ్తున్నారు. తీరా అక్కడ ఏటీఎం మెషీన్‌కు బదులుగా సెలూన్ కుర్చీలు, అద్దాలు, కటింగ్ పరికరాలు కనిపించడంతో ఆశ్చర్యపోతున్నారు. ఈ విచిత్రమైన ‘సెలూన్ ఏటీఎం’కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు వెంటనే స్పందించి ఎస్బీఐ బోర్డు, లోగోను తొలగించారు. ఈ విషయంపై నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు. “డబ్బులు విత్‌డ్రా చేయడానికి వెళ్తే, హెయిర్‌కట్‌తో బయటకు వస్తున్నారు” అంటూ కొందరు కామెంట్ చేశారు. ఇది అసలైన భారతీయ ‘జుగాడ్’ అని మరికొందరు అభిప్రాయపడ్డారు. పాత గుర్తులను తొలగించకుండా కొత్త వ్యాపారాలు చేయడం ఇక్కడ సాధారణమేనని మ‌రికొంద‌రు చమత్కరించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏసీ రిమోట్‌లో ఈ బటన్‌ నొక్కితే.. సగం కరెంటు బిల్లే

పావురంలా అందంగా కనిపించే ఈ పక్షి.. వెరీ డేంజర్‌

కందిపప్పు తింటున్నారా.. ఈ విషయం తెలిస్తే..

అరుదైన ‘నేల మామిడి’ని చూశారా?

బీఎస్ఎన్ఎల్ సరికొత్త చౌక ప్లాన్.. రూ. 225కే అపరిమిత డేటా, కాలింగ్

Follow Us