ఉచిత పెట్రోలు పంపిణీ.. దొరికినవారికి దొరికినంత..
పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. బండికి పెట్రోల్ కొట్టించుకోలేక చాలామంది ప్రత్యామ్నాయల వైపు చూస్తున్నారు. కొంతమంది పెట్రోల్ బైకులను పక్కనపెట్టి బ్యాటరీ వాహనాలపై ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పెట్రోలు ఫ్రీ గా వస్తుందంటే ఎవరైనా వదులుతారా.
పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. బండికి పెట్రోల్ కొట్టించుకోలేక చాలామంది ప్రత్యామ్నాయల వైపు చూస్తున్నారు. కొంతమంది పెట్రోల్ బైకులను పక్కనపెట్టి బ్యాటరీ వాహనాలపై ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పెట్రోలు ఫ్రీ గా వస్తుందంటే ఎవరైనా వదులుతారా. రండి బాబు రండి అని చెప్పగానే… వందలాది వాహనాలు క్యూ కట్టాయి. ఎంతలా అంటే పోలీసులు కూడా వారిని కంట్రోల్ చేయలేనంతగా ఎగబడ్డారు. పరిమితంగానే పెట్రోల్ పోసి ఆ తర్వాత ఆపేసారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి లో ఈ ఘటన జరిగింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని ఓ సంస్థ ప్రతినిధి తన కుటుంబ సభ్యుడి జన్మ దినం సందర్భంగా పెట్రోలు ఫ్రీగా పంపిణీ చేయాలని అనుకున్నాడు. ఒక్కొక్కరికి రెండు లీటర్ల పెట్రోల్ చొప్పున కూపన్లను పంపిణీ చేశాడు. నక్కపల్లి పెట్రోల్ బంకులో పెట్రోల్ పంపిణీకి సిద్ధం అయ్యారు. రెండు లీటర్ల పెట్రోల్ కూపన్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రచారం చేయడంతో జనం వాహనాలతో భారీగా చేరుకున్నారు. 150 మందికి కూపన్లు పంపిణీ చేశారు. ఈ ఫ్రీ పెట్రోల్ వ్యవహారం ఆ నోట ఈనోటా ఆ ప్రాంతమంతా వ్యాపించడంతో జనం వాహనాలతో బారులు తీరారు. జాతీయ రహదారి వెంట వెళ్లే వాళ్లు ఏమి జరుగుతుందో అర్థం కాక, ఆశ్చర్యంగా చూశారు. అసలు విషయం తెలుసుకుని కూపన్ల కోసం వాళ్లు కూడా పరుగులు తీశారు. కూపన్లు అయిపోయినప్పటికీ జనాల రద్దీ తగ్గలేదు. ఇక పోలీసులు రంగంలోకి దిగారు… మిగిలిన వారిని బయటకు పంపేశారు. కూపన్లు దక్కించుకున్న వారు హ్యాపీగా రెండు లీటర్ల పెట్రోల్ ఫ్రీ గా కొట్టించుకుని వెళితే.. విషయం తెలిసి అక్కడకు చేరుకొని కూపన్లు దక్కని వాహనదారులు పెదవి విరుస్తూ వెనుదిరిగారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Alien signal: ఏలియన్స్ నుంచి మనకు తొలి మెసేజ్ !!
ఎగిరే బల్లిని చూశారా ఎప్పుడైనా ?? అత్యంత ఖరీదైన జీవులుగా ప్రఖ్యాతి
బాలుడి వీడియోపై నెటిజన్లు ఫిదా.. షాపును కాపాడేందుకు ఏం చేశాడంటే !!
మంచి దొంగ.. రూ. 4 లక్షల నగలను.. 9 ఏళ్ళ తర్వాత తిరిగి ఇచ్చేశాడు
2018 రివ్యూ.. సినిమా ఎలా ఉంది అంటే ??