వారెవా.. లిటిల్ జీనియస్ రూబిక్ క్యూబ్ ఆర్ట్‌తో రికార్డులు

Updated on: Jan 28, 2026 | 8:26 AM

నెల్లూరుకు చెందిన నోమేష్ రూబిక్ క్యూబ్‌లతో అద్భుత దేశభక్తిని చాటాడు. రిపబ్లిక్‌ డే సందర్భంగా 30 రూబిక్ క్యూబ్‌లతో మువ్వన్నెల జెండా, సైనికుల చిత్రాన్ని కేవలం 21.43 సెకన్లలో రూపొందించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ కళాఖండాన్ని దేశానికి, సైనికులకు అంకితం చేసిన నోమేష్, చిన్నతనం నుంచే దేశభక్తిని పెంపొందించుకోవాలని సందేశమిచ్చాడు. సరిహద్దు సైనికుల త్యాగాలను గౌరవించాలని నొక్కిచెప్పాడు.

నెల్లూరు జిల్లాకు చెందిన నోమేష్‌ అద్భుత మైన ప్రతిభతో తన దేశభక్తిని చాటాడు. రిపబ్లిక్‌డే సందర్భంగా వినూత్న ప్రయోగం చేసి అందరినీ అబ్బురపరిచాడు. అన్ని రంగాల ప్రముఖుల చిత్రపటాలను రూబిక్ క్యూబ్‌ల ద్వారా రూపొందించిన నోమేష్, ఈసారి 30 రూబిక్ క్యూబ్‌లతో మువ్వన్నెల జెండా మరియు దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి దేశాన్ని కాపాడుతున్న సైనికుల ఫోటోను సృష్టించాడు. అద్భుతమైన ఈ కళాఖండం కేవలం 21.43 సెకండ్లలో పూర్తిచేసి, దేశం, సైనికులు, ప్రజలకు అంకితం చేశాడు. చిన్నతనంలోనే రూబిక్ క్యూబ్‌లపై తన ప్రతిభనను ప్రదర్శించిన నోమేష్, భారతదేశమంటే తనకెంతో భక్తిభావం కలుగుతుందని, స్వాతంత్ర్యం కోసం నిస్వార్ధంగా పోరాడిన సమరయోధులంటే తనకెంతో గౌరవమని తెలిపాడు. సరిహద్దుల్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దేశాన్ని రక్షిస్తున్న సైనికుల త్యాగం వెలకట్టలేనిదని నోమేష్‌ తెలిపాడు. సైనికుల ఫోటోను ఇలా రూబిక్‌ క్యూబ్‌లపై చిత్రించడం చాలా ఆనందంగా ఉందని నోమేష్ పేర్కొన్నాడు. ప్రతి ఒక్కరూ చిన్నతనం నుంచి దేశభక్తిని కలిగి ఉండాలని, సైనికులను గౌరవించాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. నోమేష్‌ దేశభక్తిని, అతని ప్రతిభను ప్రశంసించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? రోడ్డు కోసం గుర్రాలపై వెళ్లి వినతి పత్రం

మందుకు డబ్బుల్లేక.. ఆర్టీసీ బస్ కాజేశాడు.. మహానుభావుడు

కూచిపూడి కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన నాట్యమయూరి