Viral: దొంగను కదులుతున్న రైలు కిటికీకి వేలాడదీసిన ప్రయాణికులు.. ఎందుకంటే.?
రైల్లో ప్రయాణించేటప్పుడు ప్యాసింజర్లు చాలా అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ప్రయాణికుల లగేజీ చోరీ కోసం దొంగలు కాచుకుని ఉంటారు. తాజాగా ఓ వ్యక్తినుంచి మొబైల్ ఫోన్ కొట్టేస్తూ దొరికిపోయాడు ఓ దొంగ. ప్రయాణికులు ఆ దొంగకి చుక్కలు చూపించారు. ఆ యువకుడిని నడుస్తున్న రైలు కిటికీకి వేలాడదీశారు. బీహార్‌లో జరిగిందీ ఘటన. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రైల్లో ప్రయాణించేటప్పుడు ప్యాసింజర్లు చాలా అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ప్రయాణికుల లగేజీ చోరీ కోసం దొంగలు కాచుకుని ఉంటారు. తాజాగా ఓ వ్యక్తినుంచి మొబైల్ ఫోన్ కొట్టేస్తూ దొరికిపోయాడు ఓ దొంగ. ప్రయాణికులు ఆ దొంగకి చుక్కలు చూపించారు. ఆ యువకుడిని నడుస్తున్న రైలు కిటికీకి వేలాడదీశారు. బీహార్‌లో జరిగిందీ ఘటన. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భాగల్‌పూర్‌లో రైలు ప్లాట్‌ఫాంపై ఆగివున్న సమయంలో నిందితుడు కిటికీలోంచి మొబైల్‌ను దొంగిలించే ప్రయత్నం చేశాడు. వెంటనే అలర్టయిన ప్రయాణికుడు దొంగ చేయిని గట్టిగా పట్టుకున్నాడు. తర్వాత అతడికి బోగీలోని మిగతా ప్రయాణికులు కలిశారు. అందరూ కలిసి అతడు తప్పించుకోకుండా లోపలి నుంచి అతడి చేతులను గట్టిగా పట్టుకున్నారు. ఇంతలో రైలు కదిలిపోయింది. అయినా ప్రయాణికులు అతడి చేయిని విడిచిపెట్టలేదు. దీంతో కిటికీ బయట అతడు వేలాడుతూ కిందపడిపోకుండా తనను రక్షించమని వేడుకున్నాడు. రైలు నెమ్మదిగా కదులుతుండడంతో ప్లాట్‌ఫాంపై ఉన్న మరికొందరు పరిగెత్తుకు వచ్చి అతడిని రక్షించారు. అయితే, వారుకూడా అతడి గ్యాంగ్‌లోని వారేనని భావిస్తున్నారు. అక్కడితో ఆ వీడియో క్లిప్ ముగిసింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. రైలులో ఇలా చోరీకి యత్నించి దొరికిపోయి కిటికీ బయట వేలాడడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. సెప్టెంబరు 2022లో ఇదే స్టేషన్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. మొబైల్ దొంగతనం చేస్తూ దొరికిన దొంగను ఇలాగే 5 కిలోమీటర్లు వేలాడదీశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos